iDreamPost
android-app
ios-app

సిరాజ్- నిఖత్ జరీన్ లకు ఇవ్వనున్న ప్రభుత్వం ఉద్యోగం ఇదే!

Telangana Government Announces Group 1 Jobs For Siraj And Nikhat Zareen: హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగంతో పాటుగా.. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అలాగే నిఖత్ జరీన్ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.

Telangana Government Announces Group 1 Jobs For Siraj And Nikhat Zareen: హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగంతో పాటుగా.. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అలాగే నిఖత్ జరీన్ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.

సిరాజ్- నిఖత్ జరీన్ లకు ఇవ్వనున్న ప్రభుత్వం ఉద్యోగం ఇదే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్, రెండుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలోనే సిరాజ్ కు ప్రభుత్వం ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేబినెట్ సమావేశంలో ఆ హామీకి ఆమోదం లభించింది. అలాగే నిజామాబాద్ బాక్సర్ నిఖత్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా.. నగదు ప్రోత్సాహకం కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

గ్రూప్ 1 ఉద్యోగం?:

ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తాను సాధించిన మెడల్ ని చూపించడమే కాకుండా.. సీఎంకు తన జెర్సీని కూడా బహూకరించాడు. ఆ సమయంలోనే సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. అలాగే నిఖత్ జరీన్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. వీరు ఇరువురికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నారు. అయితే ఇద్దరూ అథ్లెట్లు కాబట్టి దాదాపుగా.. గ్రూప్ 1 కేడర్ లో డీఎస్పీ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంక కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇంక సిరాజ్- నిఖత్ జరీన్ విషయానికి వస్తే.. మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. 3 మ్యాచుల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ మీద కన్నేసింది. మూడు వన్డేల సిరీస్ ని కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు కసిగా ఉంది. ఇంక నిఖత్ జరీన్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లో ఉంది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో నిఖత్ కు భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన టాప్ బాక్సర్ వు యు చేతిలో ఓటమి చవిచూసింది. ఓటమి తర్వాత నిఖత్ కన్నీటిపర్యంతమైంది. ఆ దృశ్యాలు చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. నిఖత్ ఒలింపిక్స్ బరి నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. మరి.. సిరాజ్- నిఖత్ లకు గ్రూప్ 1 ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.