iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ 54 మంది నియమాకాలు రద్దు

  • Published Dec 11, 2023 | 8:56 AM Updated Updated Dec 11, 2023 | 8:56 AM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో, పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 54 మంది నియమాకాలు రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో, పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 54 మంది నియమాకాలు రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Dec 11, 2023 | 8:56 AMUpdated Dec 11, 2023 | 8:56 AM
Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ 54 మంది నియమాకాలు రద్దు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కీలక నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే.. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చటమే కాకుండా.. ప్రజాదర్బార్‌ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా పాలనాపరంగా కూడా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా తాజాగా 54 మంది నియమాలు రద్దు చేసింది రేవంత్ సర్కార్. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చి రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వివిధ శాఖల కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన హయాంలో.. ఆయా కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. వెంటనే.. 17 కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌కు పంపించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురు మాజీ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే తొలిగించింది. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను కూడా రద్దు చేసింది. కాగా.. ఈరోజు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు కూడా రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం 17 కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు రద్దయ్యాయి. ఆ వివరాలు..

రాజీనామా చేసిన కార్పొరేషన్ ఛైర్మన్లు వీళ్లే..

  1. సోమ భరత్ కుమార్- రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
  2. జూలూరి గౌరీ శంకర్- తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్
  3. పల్లె రవి కుమార్ గౌడ్- రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్
  4. డాక్టర్ ఆంజనేయ గౌడ్- స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్
  5. మేడె రాజీవ్ సాగర్ – టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్
  6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్- గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్
  7. గూడూరు ప్రవీణ్- టైక్స్ టైల్స్ కార్పొరేషన్ ఛైర్మన్
  8. గజ్జెల నగేష్- బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్
  9. అనిల్ కూర్మాచలం- ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
  10. రామచంద్ర నాయక్- ట్రైకార్ ఛైర్మన్
  11. వలియా నాయక్- గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్
  12. వై సతీష్ రెడ్డి- తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఛైర్మన్
  13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్- రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్
  14. రవీందర్ సింగ్- పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్
  15. జగన్మోహన్ రావు- రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్ ఛైర్మన్
  16. మన్నె క్రిశాంక్- తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్
  17. గెల్లు శ్రీనివాస్ యాదవ్- రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş