Dharani
ఆదివారం నాడు అనగా డిసెంబర్ 3 నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. అందుకు కారణం ఏంటంటే..
ఆదివారం నాడు అనగా డిసెంబర్ 3 నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. అందుకు కారణం ఏంటంటే..
Dharani
మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సరే.. ఆదివారం నాడు మాత్రం ముక్కా, చుక్కా ఉండాల్సిందే. ఆదివారం నాడు చాలా మంది నాన్ వెన్, మందుతో ఎంజాయ్ చేస్తారు. ఈ సండే కూడా అలానే ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా.. అయితే మీకు ఓ బ్యాడ్ న్యూస్.. ఆదివారం నాడు మద్యం దుకాణాలు బందు. ఎందుకు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుది పరిణామం అయిన కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం నాడు ప్రారంభం కానుంది. నేతల భవితవ్యం, మరో ఐదేళ్ల పాటు అధికారంలోకి వచ్చేది ఎవరో ఆదివారం నాడు తేలనుంది. ఇక కౌంటింగ్ సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3, ఆదివారం నాడు మద్యం దుకాణాలు బంద్ చేశారు.
డిసెంబర్ 3 అనగా ఆదివారం నాడు కౌంటింగ్ సందర్భంగా ఆ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ.. శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ అనగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి.. 4వ తేదీ, సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు. అలానే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
అలానే నిషేధిత ఆయుధాలు, కర్రలు, పేలుడు పదార్థాలతో సంచరించడం నేరమని.. అంతేకాక ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని.. మైక్ లు, మ్యూజిక్ సిస్టమ్ ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు పట్టుకుని తిరగడం నిషేధితమన్నారు. అంతేకాక కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ.. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడం మీద కూడా నిషేధం విధించారు.
అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. అలానే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30 న పోలింగ్ జరిగింది. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రాగా.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. దాంతో.. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎవరు సీఎం కుర్చీ దక్కించుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఇదే విషయమై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. మరి తెలంగాణలో అధికారం దక్కించుకునే పార్టీ ఏదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.