ఎమ్మెల్యే రాజయ్యకు షాక్.. స్టేషన్ ఘన్ పూర్ లో దక్కని టికెట్

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అని నేతలు ఆలోచనల్లో పడ్డారు. అయితే ఈ క్రమంలోనే శాసనసభకు ఎన్నికల అభ్యర్ధుల మొదటి జాబితాను బీఆర్ఎస్ ఇవాళ విడుదల చేసింది. ఈ లీస్ట్ లో కొంతమంది సిట్టింగ్ సీఎం కేసీఆర్ మొండిచేయి చూపించారు. అందులో మొదటి స్థానంలో ఉన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మొదటి లీస్ట్ లో రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం విశేషం. ఈ స్థానంలో సీఎం కేసీఆర్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా స్థానిక లీడర్ అయిన కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ శ్రీహరికి టికెట్ దక్కడంతో ఆయన అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు. అయితే సీఎం దెబ్బతో ఎమ్మెల్యే రాజయ్య ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రాజయ్యకు టికెట్ రాకపోవడానికి అనేక కారణాలు లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ రాకపోవడానికి ఆయన ప్రవర్తనే ప్రధాన కారణమంటున్నారు రాజకీయ మేధావులు. అయితే గత కొంత కాలంగా స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహారి పోటీ పడ్డారు. టికెట్ నీకా నాకా అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో పరోక్షంగా మాటల దాడి చేసుకున్నారు. ఇక మొత్తానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రాజయ్యకు షాక్ ఇస్తూ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం విశేషం.

నవ్య ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రాజయ్యకు దక్కని టికెట్!

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య స్వయంగా మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా ఒక్కసారిగా షాక్ గురైంది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవేం పిచ్చి పనులు అంటూ రాజయ్యపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య నేరుగా జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి లోలోప చర్చలు జరిపి ఆమెను శాంతింపజేసే ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో ఆమె ఇంటి నుండి మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కొన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా అప్పటి నుంచి సొంత పార్టీ నేతలు సైతం ఈసారి రాజయ్యకు టికెట్ దక్కదని బహిరంగాంగానే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని కారణంగానే ఎమ్మెల్యే రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కలేదని రాజకీయ మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BRS అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

Show comments