iDreamPost
android-app
ios-app

పవన్ కి పోయేదేమి లేదు! నష్టం అంతా చంద్రబాబుకే!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనను నమ్ముకున్న టీడీపీకి గట్టిదెబ్బ తగిలేలా ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనను నమ్ముకున్న టీడీపీకి గట్టిదెబ్బ తగిలేలా ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..

పవన్ కి పోయేదేమి లేదు! నష్టం అంతా చంద్రబాబుకే!

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇక అధికార పార్టీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే టీడీపీ, జనసేనలకు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకుంది. ఇక టీడీపీ-జనసేన పొత్తు కూడా ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పొత్తు వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారిందట. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. పవన్ తో దోస్తీ కారణంగా బాబులో ఇంతటి భయం కలగడానికి గట్టి కారణాలే వినిపిస్తున్నాయి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనను నమ్ముకున్న టీడీపీకి గట్టిదెబ్బ తగిలేలా ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే జనసేనకు ఇప్పటి వరకు రాష్ట్రంలో బలమైన కేడర్ లేదు. నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. పరిస్థితులుఎలా ఉన్నా.. పొత్తు ధర్మంగా పవన్ కోసం టీడీపీ కొన్ని స్థానాలను కేటాయించక తప్పదు. ఈ విషయంలో చంద్రబాబు అన్నీ తెలిసి కూడా.. జగన్ ని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చేయలేక పవన్ తో పొత్తుకు సై అన్నారు. కానీ.., ఇప్పటికీ పవన్ పొలిటికల్ అప్రోచ్ లో మార్పు రాకపోవడమే బాబు టెన్షన్ కి కారణం అవుతోంది. జనసేన ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు తమకి అప్పగించాలన్న డిమాండ్ టీడీపీ ముందు పెట్టింది. కానీ.., ఆ స్థానాల్లో జనసేనకు క్యాండిడేట్స్ ఉన్నారా అంటే అదీ లేదు. మరి.. ఇంత గుడ్డిగా ఎలా ముందుకి వెళ్ళాలి అన్నదే టీడీపీ అధినేత భయం.

పవన్ తో పొత్తు వ్యవహారంలో ఉన్న నష్టం ఇక్కడితో ముగిసిపోలేదు. జనసేనకు కేటాయించాల్సి రావచ్చన్న మరికొన్ని స్థానాల్లో టీడీపీ రాజకీయం మౌనం వహిస్తూ వస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కనీసం ఇంచార్జ్ లని కూడా నియమించుకోలేదు. కొన్ని స్థానాల్లోపేరుకి ఇంచార్జ్ లు ఉన్నా.. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నడవడం లేదు. దర్శి, గుడివాడ, నరసారావు పేట లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు 4 నెలల్లో పెట్టుకుని.. నియోజకవర్గాల్లో ఇలాంటి స్థితిని టీడీపీ ఎప్పుడూ ఎదుర్కోలేదు. కేవలం పొత్తు కారణంగానే ఇలా చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కి మాత్రం ఇలాంటి టెన్షన్స్ ఏమి లేవు.

తెలంగాణలో డిపాజిట్స్ కోల్పోయినా పవన్ లో ఎలాంటి స్పందన, స్పీడ్ కనిపించడం లేదు. కనీసం ఏపీలో అయినా క్యాడర్ బిల్డ్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయితే.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ పార్టీ గెలిచినా, ఓడినా పెద్దగా పవన్ కు మాత్రం జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పొలిటికల్ గా నష్టపోవడానికి జనసేన అధినేత దగ్గర ఇప్పుడు ఏమి లేదు. కానీ.., టీడీపీ పరిస్థితి వేరు. టీడీపీ ఈసారి కూడా జగన్ జోరుకి తగ్గ వ్యూహాలతో ముందుకి పోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతటి కీలకమైన ఎన్నికలకు.. అసలు ఎలాంటి రాజకీయ వ్యూహం లేని పవన్ తో కలిసి ముందుకి పోవాల్సి రావడమే చంద్రబాబుకి తలనొప్పిగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.