iDreamPost
android-app
ios-app

వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్! కొంగు చాచి అడుగుతున్నా అంటూ కన్నీరు!

  • Published May 11, 2024 | 5:01 PM Updated Updated May 11, 2024 | 5:09 PM

Pithapuram- Vanga Geetha Emotional: పిఠాపురం ప్రచారంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత భావోద్వేగానికి గురయ్యారు. తనని నాన్ లోకల్ అనడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం తన కుటుంబం అంటూ వ్యాఖ్యానించారు.

Pithapuram- Vanga Geetha Emotional: పిఠాపురం ప్రచారంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత భావోద్వేగానికి గురయ్యారు. తనని నాన్ లోకల్ అనడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం తన కుటుంబం అంటూ వ్యాఖ్యానించారు.

  • Published May 11, 2024 | 5:01 PMUpdated May 11, 2024 | 5:09 PM
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్! కొంగు చాచి అడుగుతున్నా అంటూ కన్నీరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి అంఖాని చేరుకుంది. సీఎం జగన్ ప్రచారంలో భాగంగా పిఠాపురంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పవన్ కల్యాణ్ పై బరిలోకి దిగుతున్న వంగా గీతకు మద్దతుగా సీఎం జగన్ ప్రచారంలో చేశారు. పిఠాపురంలో వంగా గీతకు దక్కిన మద్దతు, ఆదరణ చూసి అందరికీ మతిపోయింది. ఈ సభలో అభ్యర్థి వంగా గీత ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తనను పిఠాపురంలో పుట్టలేదు అంటూ కొందరు అవహేళన చేయడంపై ఆవిడ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను పిఠాపురంలో పుట్టకపోయినా పిఠాపురమే తన కుటుంబం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే జన్మంటూ ఉంటే పిఠాపురంలో పుడతానంటూ ఎమోషనల్ అయ్యారు.

వంగా గీత మాట్లాడుతూ.. “నన్ను చాలా మంది పిఠాపురంలో పుట్టలేదు అంటూ అవహేళన చేస్తున్నారు. నా కుటుంబానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను పిఠాపురంలో పుట్టకపోవచ్చు. కానీ, నా కుటుంబం మాత్రం పిఠాపురమే. నేను పిఠాపురానికి అందుబాటులో ఉండే వ్యక్తిని పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను ఇక్కడ పుట్టకపోయినా.. నా అంతిమ యాత్ర మాత్రం ఇక్కడే జరుగుతుంది. నా అక్కా చెళ్లెమ్మలు నాకు పసుపు కుంకుమ పెట్టి సాగనంపుతారు. నేను ఈరోజు చెంగు చాచి అడుగుతున్నాను. మీరు నాకు అవకాశం ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నేను పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను” అంటూ వంగా గీత కన్నీళ్లు పెట్టుకున్నారు.

“వంగా గీత అంటే అందుబాటులో ఉండే వ్యక్తి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి. నిరంతరం మీకు సేవ చేసుకునే వ్యక్తి. ఈరోజు రాష్ట్రం యావత్తు మన నియోజకవర్గం వైపు దృష్టి సారించే విధంగా పరిస్థితి ఉంది. అందరూ అనేక విషయాలు చెప్తున్నారు. అందరూ అనేక విషయాలు ప్రస్తావించారు. నేను వాటి జోలికి పోవడం లేదు. నేను ఏం చేస్తాను.. నేను చేయగలను అనే విషయాన్ని మీకు చెప్పాలి కదా? ఆ భగవంతుడు నాకు ఆయుష్షు ఇవ్వాలి గానీ.. నా చివరి శ్వాస వరకు నేను పిఠాపురం ప్రజల కోసమే పని చేస్తాను” అంటూ వంగా గీతా వ్యాఖ్యానించారు. వంగా గీతకు సీఎం జగన్ ఒక భారీ హామీని ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానంటూ పిఠాపురం ప్రజలకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom