Tirupathi Rao
Mla's And MP Jump Off From Third Floor: డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రభుత్వానికి షాకిచ్చారు. సచివాలయంలోని మూడో ఫ్లోర్ నుంచి దూకేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్లు అలా దూకేశారో చూద్దాం.
Mla's And MP Jump Off From Third Floor: డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రభుత్వానికి షాకిచ్చారు. సచివాలయంలోని మూడో ఫ్లోర్ నుంచి దూకేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్లు అలా దూకేశారో చూద్దాం.
Tirupathi Rao
మహారాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. మహారాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అక్కడి నేతలు చేసిన పనికి నోరెళ్లబెట్టేశారు. ప్రజా ప్రతినిధులే ఇలా చేశారేంటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఒక డిప్యూటీ స్పీకర్, కొందరు MLAలు, ఒక MP భవనం పైనుంచి దూకేశారు. సచివాలయం భవనంలోని మూడో అంతస్తు నుంచి వీళ్లంతా దూకారు. అయితే వీళ్లు దూకిన ప్రాంతంలో సేఫ్టీ కోసం కట్టిన నెట్ ఉండటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. అసలు సొంత వర్గం వాళ్లే ఇలాంటి పని చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఈ తాజా పరిణామాలతో కాసేపు సచిలవాలయంలో వాతారణం కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే అసలు డిప్యూటీ స్పీకర్ ఎందుకు దూకారు? అతనితోపాటి మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు దూకారో పూర్తి వివరాలు చూద్దాం.
మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. ధన్ గఢ్ కమ్యూనిటీ విషయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ధన్ గఢ్ కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చాలి అని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ విషయంలోనే కొందరు నేతలు భిన్న స్వరాన్ని వినిపించారు. ఎస్టీల్లో ధన్ గఢ్ కమ్యూనిటీని చేర్చడానికి వీల్లేదు అంటూ వారు నిరసనకు దిగారు. డిప్యూటీ స్పీకర్ సహా, పలువురు ఎమ్మెల్యే, ఎంపీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆదివాసీ వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్ మూడో అంతస్తు నుంచి దూకేశారు. ఆయనతో పాటుగా.. ఎమ్మెల్యేలు రాజేష్ పాటిల్, కిరణ్ లహమాటే, హిరామన్ ఖోస్కర్ కూడా మూడో అంతస్తు నుంచి దూకేశారు. అలాగే బీజేపీ ఎంపీ హేమంత్ సావ్రా కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఈ నాయకులు అంతా మూడో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకేశారు. అయితే మొదటి అంతస్తు వద్ద వలతో ఒక భద్రతా వలయం ఏర్పాటు చేశారు. ఈ నేతలు అంతా ఆ వలలో పడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అంతా వలలో పడగా.. వారిని సురక్షితంగా బయటకు తీశారు. హుటాహుటిన పోలీసులు అందరు నేతలను వల నుంచి బయటకు తీశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు సచివాలయంలో జరిగాయి. అందుకే ముందసత్తు జాగ్రత్తగా 2018 నుంచి సచివాలటంలో ఈ తెరను ఏర్పాటు చేయించారు.తో రిగంట ఈ ఘటన తర్వాత నిరసన తెలిపిన నాయకులు స్పందించారు. ధన్ గఢ్ కమ్యూనిటీ సభ్యుల బాగు కోసం ప్రభుత్వం పని చేయడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. ధన్ గఢ్ ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ధన్ గఢ్ కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చడాన్ని మాత్రం నిరసిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు సచివాలయంలోనే నిరసన తెలుపుతామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఎవరైతే నిరసనలకు దిగారో వారితో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. నిరసనలు తెలుపుతున్న వారితో మాట్లాడి వారి మనసు మార్చేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు మూడో అంతస్తు నుంచి దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ల తీరు చూసి మహారాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీకి నెట్ ఉంది కాబట్టి సరిపోయింది.. లేదంటే ఏమౌ ఉండేదని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే సేఫ్టీ నెట్ ఉందని చూసుకునే ఎమ్మెల్యేలు దూకారని కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బెదిరించడానికే ఇలా నెట్ ఉన్న దగ్గర దూకారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి.. ఎమ్మెల్యేలు మూడో అంతస్తు నుంచి దూకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
महाराष्ट्र विधानसभा के डिप्टी स्पीकर नरहरी झिरवल ने शुक्रवार को मंत्रालय की तीसरी मंजिल से छलांग लगा दी। उनके साथ विधायक हीरामन खोसकर भी कूद पड़े। हालांकि, नीचे जाल रहने के कारण उनकी जान बच गई। झिरवल उपमुख्यमंत्री अजीत पवार की NCP गुट के विधायक हैं। बताया जा रहा है कि वे शिंदे… pic.twitter.com/8DPmfmMv5I
— Vikas Makwana (@Vikasmakwana111) October 4, 2024