iDreamPost
android-app
ios-app

స్టేజిపై కొట్టుకున్న MLA వివేకా, BJP నేత శ్రీశైలం గౌడ్!

  • Published Oct 26, 2023 | 7:36 AM Updated Updated Oct 26, 2023 | 7:36 AM

తాజాగా, ఎమ్మెల్యే వివేక, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ల మధ్య ఓ టీవీ కార్యక్రమం గొడవకు దారి తీసింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా, ఎమ్మెల్యే వివేక, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ల మధ్య ఓ టీవీ కార్యక్రమం గొడవకు దారి తీసింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Oct 26, 2023 | 7:36 AMUpdated Oct 26, 2023 | 7:36 AM
స్టేజిపై కొట్టుకున్న MLA వివేకా, BJP నేత శ్రీశైలం గౌడ్!

మరికొద్దిరోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రజల్ని ఆకట్టుకోవటం కోసం నానా తిప్పలు పడుతున్నారు. తక్కువ కాలంలో ప్రజలకు దగ్గర కావటానికి సోషల్‌ మీడియా, మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఇతర చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, కొన్ని సార్లు టీవీ కార్యక్రమాల్లో నేతలు బాహాబాహీకి దిగే పరిస్థితులు నెలకొంటున్నాయి.

 తాజాగా, ఎమ్మెల్యే వివేక, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ల మధ్య ఓ టీవీ కార్యక్రమం గొడవకు దారి తీసింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ ఛానల్‌ తాజాగా, గెలుపెవరిది? అన్న కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెలే వివేక, బీజేపీ నేత శ్రీశైలం గౌడ్లు, కాంగ్రెస్‌ నేత హన్మంత్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ముగ్గురూ స్టేజిపై ఉన్న పోడియం దగ్గర నిలబడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వివేక.. శ్రీశైలంపై కొన్ని కామెంట్లు చేశారు.

తర్వాత శ్రీశైలం- వివేకపై కామెంట్లు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వాగ్వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివేక- శ్రీశైలం గౌడ్‌పైకి వెళ్లారు. దీంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాల వాళ్లు స్టేజిపైకి రావటంతో గొడవ మరింత పెరిగింది. ఆ గొడవ సద్దు మణగడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio