iDreamPost
android-app
ios-app

తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం.. హరీశ్ రావును కలిసిన MLA రాజాసింగ్!

  • Author Soma Sekhar Published - 05:33 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 05:33 PM, Fri - 14 July 23
తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం.. హరీశ్ రావును కలిసిన MLA రాజాసింగ్!

రాజకీయాలు ఎప్పుడు ఎటు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పక్షనేతలతో భేటీ కావడం అసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడో చుక్క తెగిపడ్డట్లుగా అధికార పక్ష నాయకులతో భేటీ అవుతుంటారు ప్రతిపక్ష నేతలు. తాజాగా అలాంటి భేటీనే తెలంగాణ పాలిటిక్స్ లో జరిగింది. తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును కలిశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. దాంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. త్వరలోనే రాజా సింగ్ బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కలిశారు. దాంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మెుదలైంది. హరీశ్ రావుతో రాజా సింగ్ భేటీ కావడంతో.. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు రాజా సింగ్.”నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల నిధుల కోసం మంత్రి హరీశ్ రావును కలిశాను. నేను బీజేపీలోనే ఉంటా.. బీజేపీలోనే మరణిస్తాను. పార్టీ నాపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా” అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ధూల్ పేటలో మోడల్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావును కలిసినట్లు రాజా సింగ్ తెలిపారు. అంతకు మించి ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన వివరించారు.

ఇదికూడా చదవండి: వారికి సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. రూ.3 లక్షల ఆర్థిక సాయం!