iDreamPost
android-app
ios-app

MPగా గెలిచిన పోలీస్ కానిస్టేబుల్ భార్య.. ఇది సామాన్యురాలి విజయం

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించారు నలుగురు అభ్యర్థులు. అత్యంత పిన్న వయస్సులోనే పార్లమెంట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒకరు ఈమె కూడా . ఎమ్మెల్యేగా ఓడించి.. ఎంపీగా పట్టం కట్టారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించారు నలుగురు అభ్యర్థులు. అత్యంత పిన్న వయస్సులోనే పార్లమెంట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒకరు ఈమె కూడా . ఎమ్మెల్యేగా ఓడించి.. ఎంపీగా పట్టం కట్టారు.

MPగా గెలిచిన పోలీస్ కానిస్టేబుల్ భార్య.. ఇది సామాన్యురాలి విజయం

దేశంలో బిగ్ ఫైట్ ముగిసింది. లోక్ సభ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేశాయి. ఎన్టీఏ కూటమికి గట్టిపోటీనిచ్చింది ప్రతిపక్ష కూటమి. ఈ సారి ఎన్డీఏ 400లకు పైగా స్థానాలను గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు బీజెపీ నేతలు అతి విశ్వాసాన్ని ప్రదర్శించారు. బీజెపీకి సొంతంగానే 370కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికారు. కానీ ఇండియా కూటమి ఆ ఫిగర్‌కు చెక్ పెట్టింది. ఈ ఫలితాల్లో ఎన్టీఏకు 292 స్థానాలు దక్కాయి. ఇండియా కూటమి 234 స్థానాల్లో విజయం సాధించింది. 17 స్థానాల్లో ఇతరులు జయ కేతనం ఎగుర వేశారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నాడు మోడీ. ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో పొలిటీషియన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు పోటీ చేశారు. అలాగే సామాన్యులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో ఒకరు సంజనా జాతవ్. 18వ లోక్ సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచిన ఎంపీల్లో ఆమె కూడా ఒకరు. ఓ కానిస్టేబుల్ భార్య, అత్యంత సామాన్యురాలికి దక్కిన నిజమైన విజయం ఇది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగి.. బీజెపీ అభ్యర్థిని మట్టి కరిపించింది. అయితే గతంలో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన కథుమార్‌లోని ఓటర్లు.. ఓ సారి బీజెపినీ గెలిపిస్తే.. మరోసారి కాంగ్రెస్‌కు విజయం అందిస్తున్నారు. 1998 నుండి ఇదే తంతు కొనసాగుతుంది.

Police wife won as MP

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేయగా.. బీజెపీ అభ్యర్థి రమేశ్ ఖించి చేతిలో 409 ఓట్ల తేడాతో ఓడిపోయింది సంజనా. ఆ ఓటమి నుండి బయటపడ్డ ఆమెపై నమ్మకముంచిన కాంగ్రెస్.. ఈ సారి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన భరత్ పూర్ నుండి బరిలోకి దింపింది. ఈ సారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆమె. ఈ సారి తన ప్రత్యర్థి, బీజెపీ నేత రామ స్వరూప్ కోలిని 51, 983 ఓట్ల తేడాతో గెలిచింది. 2019లో మహారాజా సూరజ్ మిల్ బ్రిజ్ యూనివర్శిటీ నుండి డిగ్రీ చేసిన సంజనా.. పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు ప్రకారం.. ఆస్తుల విలువ రూ. 23 లక్షలు కాగా, చరాస్తులు రూ. 7 లక్షలు. గెలిచిన తర్వాత నాకు టిక్కెట్ ఇచ్చిన పార్టీకి, మద్దుతు తెలిపిన ప్జలకు ధన్యవాదాలు తెలిపింది సంజనా. ఎమ్మెల్యేగా ఓడించి.. ఇప్పుడు ఎంపీగా గెలిపించారు ప్రజలు.