Idream media
Idream media
తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అనే తెలుగు సామెతకు టీడీపీ నేతల వ్యవహారశైలి అతికినట్లుగా సరిపోతుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ నేతలపై, సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు, వారి సంస్కారం గురించి మాట్లాడడం గురివింజను తలపిస్తోంది. తాను లేని సభలో తన గురించి మాట్లాడారని, బూతులు తిట్టారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇదేనా మీ సంస్కారం అంటూ ప్రశ్నిస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యలకు ధీటుగా వైసీపీ నేతలు బదులిస్తున్నారు. గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవుపలుకుతున్నారు.
లోకేష్ వాదన ఇదీ..
తాను లేని సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బూతులు తిట్టారని నారా లోకేష్ చెబుతున్నారు. ‘‘తాను శాసనసభలో సభ్యుడిని కాదు. అలాంటి తన గురించి ఆ సభలో మాట్లాడడంతోపాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బూతులు తిట్టారు. దానికి సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వారు. స్పీకర్ కూడా నవ్వారు. ఇదేనా సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు, తన కూతుళ్లకు నేర్పిన సంస్కారం..?’’ అంటూ లోకేష్ ప్రశ్నించడంతో వైసీపీ నేతలు అందుకున్నారు.
గతాన్ని గుర్తు చేస్తూ..
తాను లేని సభలో తన గురించి మాట్లాడారని, బూతులు తిట్టారని అంటూ తమకు సంస్కారం నేర్పిస్తున్న నారా లోకేష్‌పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. గతాన్ని గుర్తు చేస్తూ.. ఇదీ మీ సంస్కారం అంటూ హితబోధ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. శాసనసభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరచిపోయారా..? అని ప్రశ్నిస్తున్నారు. నారా లోకేష్ టీడీపీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి. మాజీ మంత్రి కూడా. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు. టీడీపీ యువ సారధి.. అలాంటి నేత గురించి శాసనసభలో మాట్లాడి ఉంటే.. అది తప్పు అయితే.. మరి టీడీపీ నేతలు అసలు భౌతికంగా లేని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి శాసనసభలో మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని లోకేష్ ఎలా సమర్థించుకుంటారు..? అనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తోంది.
ఏదైనా తనదాక వస్తే గానీ తెలియదన్నట్లుగా నారా లోకేష్‌కు ఇప్పుడు సంస్కారం గుర్తు వచ్చిందా..? అంటూ వైసీపీ నేతలు చురకలు అంటిస్తున్నారు. నాడు శాసనసభలో వైఎస్సార్ గురించి టీడీపీ సభ్యులు, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయం.. సభలోలేని తనకు తెలియదని లోకేష్ అంటారేమో..!