కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్‌ గుండా పనే: కేటీఆర్‌

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మీద దాడి జరిగిన సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈక్రమంలో దాడి చేసిన నిందితుడి గురించి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మీద దాడి జరిగిన సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈక్రమంలో దాడి చేసిన నిందితుడి గురించి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రచారం ముగించుకుని.. తిరిగి వచ్చిన ప్రభాకర్‌రెడ్డిపై గట్టని రాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుత ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇక ఈ ఘటనపై పార్టీలన్ని ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయి. నిందితుడిది మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ విమర్శించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. నిందితుడు ఎవరో చెబుతూ.. ఇంకా ప్రూఫ్స్‌ కావాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ ‘‘కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గుండా’’ అంటూ ఈ మేరకు ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డి మీద దాడి వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ప్రభాకర్‌ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అని ఆరోపించడమే కాక.. ఇంకా ఏమన్నా రుజువులు కావాలా రాహుల్‌ గాంధీ అంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్‌.

కత్తిపోటుకు గురై సికింద్రాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ భౌతిక దాడులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ నేతలను భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ ఘటనపై కేసీఆర్‌, హరీష్‌ రావులు సైతం స్పందించారు.

Show comments