Venkateswarlu
Konda Surekha Biography & Political Journey: కొండా సురేఖ వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే, రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 5 సార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రెండో సారి మంత్రి పదవి చేపట్టనున్నారు.
Konda Surekha Biography & Political Journey: కొండా సురేఖ వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే, రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 5 సార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రెండో సారి మంత్రి పదవి చేపట్టనున్నారు.
Venkateswarlu
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ తమదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఓ సాధారణ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీల మార్పుతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. వివాదాలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా మారారు. 2023 ఎన్నికల సమయంలో సొంతగూడు కాంగ్రెస్‌లోకి వచ్చి.. మళ్లీ ఎమ్మెల్యేగా సత్తా చాటారు. ఇప్పుడు రాష్ట్ర కేబినేట్‌లో చోటు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 11 మంది మంత్రుల జాబితాలో కొండా సురేఖ పేరు కూడా ఉంది. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొండా సురేఖ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ అనే గ్రామంలో ఆగస్టు 19 1956 సంవత్సరంలో జన్మించారు. సురేఖ తండ్రి పేరు తుమ్మ చంద్రమౌళి, తల్లి తుమ్మ రాధ. ఐదుగురు సంతానంలో సురేఖ మూడవ బిడ్డ. సురేఖకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, ఓ తమ్ముడు ఉన్నారు. సురేఖ తండ్రి ఆర్‌అండ్‌బీలో పనిచేసేవారు. చిన్నతనం నుండి ఆమె చదువుతో పాటు ఎక్స్‌ట్రాకరికులమ్ యాక్టివిటీస్‌లో చాలా చురుగ్గా ఉండేవారు. డిబేట్ పోటీల్లో తప్పకుండా పాల్గొనేవారు. షటిల్ ఆడటం అంటే ఆమెకు బాగా ఇష్టం. ఇప్పటి కూడా ఆడుతూ ఉంటారు. అప్పట్లోనే టూవీలర్‌లో కాలేజీకి వెళ్లేవారు. చదువులో.. ఆటల్లో ఇలా అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కొండా మురళిని కొండా సురేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇద్దరి కులాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘ కాలేజీ టైంలో మా బ్యాచ్ 13 మంది అమ్మాయిలం.. వీళ్లు నలుగురు. నా వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఆయన మా బ్యాచీలో ఎవరికోసం తిరుగుతున్నాడో అర్థం కాకపోయేది. మేము ఎక్కడికి పోతే అక్కడికి నలుగురూ వచ్చేవాళ్లు.
నా కోసం తిరుగుతున్నాడని తర్వాత తెలిసింది. ఎస్‌డీ మీద నా చుట్టూ తిరిగేవాడు. నేను వెళ్లే బస్సును ఫాలో అయ్యేవాడు. ఓ రోజు బైకు తీసుకుని నా ముందు వచ్చి ఆపాడు. మీ ఫోన్ నెంబర్ మా కెందుకు అన్నాను. కొంచెం బ్రతిమాలటంతో తీసుకున్నాను. చాలా రోజులు నా చుట్టూ తిరుగుతూ ఉంటే చేయాలని అనిపించి ఫోన్ చేశా. తర్వాత ఓ రోజు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. తర్వాతి నుంచి మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ప్రేమ వివాహం చేసుకున్నాము.
1995లో కొండా సురేఖ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భర్త ఉన్న కాంగ్రెస్ పార్టీతోటే ప్రస్ధానాన్ని మొదలుపెట్టారు. మొదటి సారి మండల పరిషత్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత 1996లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితురాలయ్యారు. 1999లో శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004-2009 ఎన్నికల్లోనూ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు, జువైనల్ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కొండా దంపతులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో వివాదాలతోనూ చాలా ఫేమస్ అయ్యారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఎంతో అన్యోన్యంగా ఉన్న కొండా మురళి.. దయాకర్ రావు తర్వాత రాజకీయ శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు పబ్లిక్‌గా విమర్శలు చేసుకునే స్థాయికి గొడవలు వెళ్లాయి. దయాకర్ రావు అనుచరుడిగా ఉన్న మురిళి.. ఆయనతోనే ఎందుకు గొడవలు మొదలయ్యాయి. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందంటే.. టీడీపీలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ కీలక నేతగా ఉన్నప్పుడు కొండా మురళి ఆయన అనుచరుడిగా ఉండేవాడు.
అప్పట్లో కల్పన టీడీపీ ఎంపీగా గెలిచింది. అయితే, సంగెంలో జనశక్తి బలంగా ఉండటంతో ఇతర పార్టీల వాళ్లు అక్కడికి వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. అప్పటి సీఐ కొండా మురళి విషయం చెప్పాడు. కొండా మురళి జీపులో.. సీఐ, ఎంపీ కల్పన, దయాకర్ రావులను కూర్చోబెట్టుకని సంగెం వెళ్లారు. అక్కడ ఎవ్వరూ వీరిని ఆపలేదు. ఈ సమయంలో ఎర్రబెల్లి పోలీసుల గురించి మాట్లాడమని మురళికి చెప్పారు. మురిళి పోలీసుల గురించి మాట్లాడుతూ సీఐకి కొంచెం పిచ్చి లేసింది అని అన్నాడు.
ఆ మాటల్ని మనసులో పెట్టుకున్న సీఐ తర్వాత మురళి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాడు. 7 రోజులకు ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎస్పీని కలిశారు. ఏం తప్పు చేశానని అరెస్ట్ చేశారు అని ప్రశ్నించాడు. ఇందుకు ఎస్పీ సమాధానం ఇస్తూ.. ‘‘నీ ఫాలోయింగ్ పెరిగిపోతోందని.. దయాకర్ అరెస్ట్ చేయమన్నాడు’’ అని చెప్పారు. దీంతో దయాకర్ రావుతో పాటు టీడీపీలో ఉండలేకపోయిన మురళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, అప్పటినుంచి కొండా దంపతులకు.. ఎర్రిబెల్లికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితు దృష్టా‍్య భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు. కొండా సురేఖ 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపునుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్‌ఎస్ అధిష్టానంతో కొండా దంపతులకు గొడవలు జరిగాయి. దీంతో పార్టీ మారారు. మళ్లీ సొంత గూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీల మార్పు విషయంలో కొండా దంపతులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రత్యర్థులు ఈ విషయంలో కొండా సురేఖపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా పార్టీల మార్పుతో ఆమె విమర్శలు ఎదుర్కోవటానికి ఆమె వీర విధేయతే ప్రధాన కారణం. వైఎస్సార్‌కు కొండా సురేఖ నమ్మిన బంటులా ఉన్నారు. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా మొదటగా స్పందించింది కొండా సురేఖే. వైఎస్ జగన్‌కు మద్దతుగా 4 జూలై 2011న ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఆమె బీఆర్‌ఎస్‌లో చేరాల్సి వచ్చింది. వాస్తవానికి సురేఖ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, భర్త మురళి వివాదాలు ఆమెకు కూడా ఆపాదించబడుతూ వస్తున్నాయి. మరి, కొండా సురేఖ బయోగ్రఫీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.