sai
sai
జనాలందరూ జైజగన్ అంటున్నారు.. సర్వేలన్ని మరోసారి వైసీపీ ప్రభంజనమే ఖాయం అని నొక్కి చెబుతున్నాయి. జగన్ పెట్టుకున్న టార్గెట్ 175 కి 175 ఈజీగా రీచ్ అవుతారని అర్థం అవుతోంది. సర్వేలన్ని.. రానున్న ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఢంకా బజాయించి చెబుతున్నాయి. అటు చూస్తేనేమో ఎన్నికలకు సరిగా ఏడాది కూడా లేదు. ఏం చేయాలో.. జగన్ క్రేజ్‌ను ఎలా తగ్గించాలో విపక్షాలకు అర్థం కావడం లేదు. దాంతో వాలంటీర్ వ్యవస్థ మొదలు సంక్షేమ పథకాల వరకు ప్రతి దాని మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ జనాలు దారుణంగా ఛీ కొట్టడంతో.. తోక ముడిచారు.
జగన్ మీద, వైసీపీ పాలన మీద అసత్య ప్రచారాలు చేస్తే.. రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశారు. దాంతో పంథా మార్చి.. తమకు తామే డప్పు కొట్టుకునే కార్యక్రమం ప్రారంభించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలంతా ప్రస్తుతం సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి టీడీపీ నేతలు గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ.. బాబు మొదలు.. టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి జనాలు పగలబడి నవ్వుతున్నారు. ఇక తాజాగా జలీల్ ఖాన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ వివరాలు..
విజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తామని ఆఫర్ వచ్చింది. కానీ ఆయన మాత్రం.. నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే ముఖ్యమని చెప్పి.. ప్రధాని పదవి వదులుకున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చంద్రబాబు ప్రధాని అయితే ఇప్పుడు మాకీ ఖర్మ ఉండేది కాదు కదా అంటున్నారు ఏపీ ప్రజలు.
చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ pic.twitter.com/CP0XIhWH2J
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2023