Good News For Who Did not Got Loan Waiver: రుణమాఫీ కాని రైతులకు CM రేవంత్ శుభవార్త.. ప్రత్యేక కౌంటర్లు

రుణమాఫీ కాని రైతులకు CM రేవంత్ శుభవార్త.. వారికోసం ప్రత్యేక కౌంటర్లు..

Independence Day 2024- Good News For Who Did not Got Loan Waiver: దేశ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు రుణమాఫీ అందని అర్హులైన రైతులకు ముఖ్యమంత్రి శుభవార్త అందజేశారు.

Independence Day 2024- Good News For Who Did not Got Loan Waiver: దేశ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు రుణమాఫీ అందని అర్హులైన రైతులకు ముఖ్యమంత్రి శుభవార్త అందజేశారు.

తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోట్ల మంది మహానుభావుల త్యాగాల పుణ్యమా అని మనకి స్వాతంత్రం దక్కింది అన్నారు. మహాత్ముడి స్ఫూరితో ప్రజా పాలన అందిస్తున్నామన్నారు. కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారమే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నెహ్రూ హయాం నుంచే దేశ విజయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సాగునీట ప్రాజెక్టుల నిర్మాణంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ అందని రైతులకు శుభవార్త చెప్పారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తోంది కూడా. అందులో భాగంగానే రైతులకు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ విడతల వారీగా రైతు రుణమాఫీని అమలు చేస్తూ వస్తోంది. మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికే రెండు విడతల్లో రైతు రుణమాఫీని అమలు కూడా చేశారు. మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపజేశారు. ఇప్పుడు మూడో విడతకు కూడా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా వైరా బహిరగం సభలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ కాని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.

ఆ రైతులకు శుభవార్త:

రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. ఇప్పటివరకు రెండు విడతల్లో రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ రెండు విడతల్లోరుణమాఫీ కాని రైతులకు ఆయన మరో శుభవార్తను అందించారు. రుణమాఫీ కాని రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులకు కచ్చితంగా రుణమాఫీ అందుతుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కేంద్రాల ద్వారా అర్హత కలిగి రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ దక్కేలా చూస్తామన్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామి తెలిపారు. అర్హత ఉండి ఇప్పటివరకు రుణమాఫీ దక్కని రైతులు ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments