iDreamPost
android-app
ios-app

ఎన్నికల్లో భార్యపై MLAగా గెలిచిన భర్త! ఎక్కడంటే?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. నాల్గింటిలో ఫలితాలు వచ్చేశాయి. బీజెపీ మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించింది. ఇదే సమయంలో కొంత మంది సామాన్యులు.. రాజకీయ నేతలను ఓడించి చరిత్ర సృష్టించారు. అలాగే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. నాల్గింటిలో ఫలితాలు వచ్చేశాయి. బీజెపీ మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించింది. ఇదే సమయంలో కొంత మంది సామాన్యులు.. రాజకీయ నేతలను ఓడించి చరిత్ర సృష్టించారు. అలాగే..

ఎన్నికల్లో భార్యపై MLAగా గెలిచిన భర్త! ఎక్కడంటే?

ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. నాలుగింటి రిజల్ట్స్ వచ్చేశాయి. మూడింటిని బీజెపీ కొల్లగొడితే.. ఒక విజయంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్. అయితే ఆ ఒక్కటీ కూడా కాంగ్రెస్‌కు చాలా కీలకమైన రాష్ట్రమే. ఈ ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. సామాన్యులు సైతం ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయ నేతలను మట్టికరిపించి.. అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. మరి కొంత మంది అయితే ఉద్దండులపై విజయకేతనం ఎగురవేసి ఆశ్చర్యపరుస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయగా.. విజయం బీజెపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని వరించింది.

అలాగే చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ సాహూ అనే దినసరి కూలీ ఏడు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రపై 5 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. అయితే భార్యపై భర్త గెలిచిన అరుదైన  ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు, సోదరీ-సోదరులు, మామ అల్లుడు లేదా కోడలు ఒకరిపై ఒకరు పోటీ చేయడం గురించి విన్నాం, చూసుంటాం. కానీ అతడు భార్యపై పోటీ చేసి గెలుపొందాడు. అతడి పేరు వీరేంద్ర సింగ్. రాజస్తాన్‌లోని సికార్ జిల్లాలోని దంతారామ్ గఢ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు వీరేంద్ర. వీరేంద్రకు ప్రత్యర్థిగా జేజేపీ నుండి పోటీ చేశారు ఆయన భార్య రీటా సింగ్. ఈ ఎన్నికల్లో వీరేంద్ర గెలుపొందారు. రీటా ఓడిపోయారు.

ఇక మరో విచిత్ర ఘటన ధోల్ పూర్‌లో జరిగింది. సోదరుడిపై విజయం సాధించింది చెల్లెలు. ధోల్ పూర్ లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగారు శోభారాణి కుష్వాహా. బీజెపీ నుండి ఎన్నికలోకి బరిలోకి దిగాడు ఆమె అన్నయ్య శివ చరణ్ కుష్వాహా. అయితే ప్రజలు ఆమెకే పట్టం కట్టారు. ఇలా చెల్లెలు చేతిలో ఓడిపోయారు అన్నయ్య. ఇలాంటి అరుదైన, వింతైన సంఘటనలు ఎన్నికల సమయంలో చోటుచేసుకోవడం విశేషం. రాజస్తాన్ రాష్ట్రంలో మొత్తం 199 స్థానాలకు ఎన్నికల్లో జరగ్గా.. స్పష్టమైన మెజార్టీతో బీజెపీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. తర్వలో అక్కడ బీజెపీ.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరీ ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.