Tirupathi Rao
Harish Rao- BRS Call For Band: ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. హరీశ్ రావు కవిత అరెస్టును ఖండించడమే కాకుండా.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చారు.
Harish Rao- BRS Call For Band: ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. హరీశ్ రావు కవిత అరెస్టును ఖండించడమే కాకుండా.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చారు.
Tirupathi Rao
మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో కవితను అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. అలాగే కవిత భర్తకు అరెస్టుకు సంబంధించిన సమాచారం అందించారు. ఆ తర్వాత కవితను సొంత వాహనంలోనే శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. రాత్రి 8.50 నిమిషాల విమానంలో కవితను ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ఈ అరెస్టు అక్రమం అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు ఖండంచారు. హరీశ్ రావు కవిత అరెస్టును ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కవిత అరెస్టు విషయంలో ఈడీ అధికారులు, కేంద్రంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజకీయ దుర్ధేశంతోనే పథకం ప్రకారం కుట్రతో బీజేపీ మా శాసనమండలి సభ్యురాలిని అరెస్టు చేయించింది. ఈ అరెస్టుపై బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేశారు. ఈడీ అధికారుల్లాగా కవితను అరెస్టు చేస్తామంటూ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు పలుమార్లు ప్రకటన చేయడం చూశాం. రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. ఈసీఈ ప్రకటన తర్వాత కవితను అరెస్టు చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారిని డీమోరలైజ్ చేసే ప్రయత్నమే ఇది.
ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడం మాకు కొత్తేంకాదు. 14 ఏళ్లు పోరాడి.. అసలు రానే రాదు అన్న రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. పోరాటాల నుంచి పుట్టిందే మా పార్టీ. మాకు ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టడం కొత్తేం కాదు. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. ఈరోజు సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు మహిళలను అరెస్టు చేయచ్చా అనే కేసులో విచారణ జరిగింది. ఆ కేసు 19వ తేదీకి వాయిదా పడింది. స్వయంగా ఈడీనే సుప్రీంకోర్టులో కవితను అరెస్టు చేయం అంటూ చెప్పింది. చెప్పిన మాటకు విరుద్ధంగా, అది కూడా శుక్రవారం రోజు సాయంత్రం 6.30 గంటలకు అరెస్టు చేయడం రాజకీయ కుట్రే అవుతుంది.
రేపు నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఇలా చేయడం మమ్మల్ని దెబ్బతీయాలనే దురుద్ధేశమే. మమతా బెనర్జీ బంధువు, ఎమ్మెల్సీ కవిత, నళిని చిదంబరం గారికి సంబంధించి.. ముగ్గురిని కలిపి కేసు సుప్రీంకోర్టు వింటోంది. మహిళలను అసలు ఈడీ అధికారులు అరెస్టు చేయచ్చా? లేదా అనే విషయాలను పరిశీలిస్తోంది. ఇలాంటి తరుణంలో కవితను అరెస్టు చేశారు. ఇది ఎమర్జెన్సీకి మించిన పరిస్థితి. ఇలా చేయడం కేంద్రానికి కొత్తేం కాదు. మా నేతలపై ఇప్పటికే ఎన్నో కుట్రలు జరిగాయి. ఇప్పటికే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈరోజు కవిత అరెస్టుకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున నిరసనలు తెలపాలి” అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు