iDreamPost
android-app
ios-app

నేడు గోదావరి బోర్డు మీటింగ్‌.. ఏం జరగనుందో?

నేడు గోదావరి బోర్డు మీటింగ్‌.. ఏం జరగనుందో?

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం శుక్రవారం తెలంగాణలో జరగనుంది. ఇప్పటికే ఏపీ రెండు డీపీఆర్‌లను బోర్డుకు సమర్పించింది. పోలవరం కాలువ నుంచి మూడు దశల్లో నీటిని ఎత్తిపోసి… విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం డీపీఆర్‌తో పాటు రాజమహేంద్రవరం వద్ద చేపట్టిన వెంకటనగరం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ సమర్పించింది. ఇవన్నీ అంశాలపై బోర్డులో చర్చించనున్నారు. జీఆర్‌ఎంబీ ఇన్‌చార్జీ ఛైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌తో పాటు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ఆహ్వానం పంపారు.

ఈ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బోర్డు బడ్జెట్‌తో పాటు గెజిట్‌ అమలు, సీడ్‌ మనీ కింద తెలుగు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు జమ, అనుమతుల్లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వంటి అంశాలపై చర్చను ఎజెండాగా పెట్టుకున్నారు. తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌లు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో క్లియరెన్స్‌ పొంది రావడంతో వాటిపై కూడా చర్చించి, బోర్డు తన అభిప్రాయాలు తెలియజేస్తూ… తదుపరి అనుమతి కోసం టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ)కి పంపించనుంది. చనకా కొరటా, చౌటపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వర్‌ ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు సీడబ్ల్యూసీ పరిశీలనలు పూర్తి చేసుకొని బోర్డు సమావేశం కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే, పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్రమంత్రి ఒకరు రానున్నారని సమాచారం ఇచ్చిన ఏపీ.. సమావేశాన్ని వాయిదా వేయాలని ఇదివరకే కోరింది. అయితే కేంద్రమంత్రి పర్యటన వాయిదా పడినందున బోర్డు సమావేశం యధావిధిగా జరుగుతుందని గోదావరి బోర్డు సమాచారం ఇచ్చింది.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet giriş