iDreamPost
android-app
ios-app

Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీశ్ రావు తొలి డిమాండ్ ఇదే..

తెలంగాణలో అధికార పక్షం తమ పనిని ప్రారంభించేసింది. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా హామీలను అమలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ప్రతిపక్షం కూడా తమ పాత్రను ప్రారంభించేసింది.

తెలంగాణలో అధికార పక్షం తమ పనిని ప్రారంభించేసింది. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా హామీలను అమలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ప్రతిపక్షం కూడా తమ పాత్రను ప్రారంభించేసింది.

Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీశ్ రావు తొలి డిమాండ్ ఇదే..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేయడం కూడా ప్రారంభించేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేయడం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ప్రతిపక్షం తమ పనిని ప్రారంభించింది. ప్రజల తరఫున ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు తమ తొలి డిమాండును తెలియజేశారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కూడా చేశారు. రేవంత్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు కూడా చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో చెప్పిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీని కూడా ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రతిపక్షంగా తమ బాధ్యతను కూడా నిర్వర్తించారు. తమ తొలి డిమాండును రేవంత్ సర్కారుకు వినిపించారు.

ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇలా అడుగుతున్నాం అని కాకుండా.. అధికారంలో ఉన్నా- ప్రతిపక్షంలో ఉన్నా తాము మాత్రం రైతుల పక్షానే ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతులంతా సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వడ్లు అమ్ముకోకండి రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిన హామీని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆ హామీ ప్రకారం రైతుల నుంచి రూ.500 బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో ప్రభుత్వం చెప్పాలంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా చాలాచోట్ల వడ్లు తడిసిపోయాయన్నారు. అలా వర్షం కారణంగా ఒడ్లు తడిసిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

అంతేకాకుండా రైతుబంధు గురించి కూడా గుర్తు చేశారు. డిసెంబర్ 9 నుంచే ఎకరాకు రూ.1500 రైతుబంధు ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ రైతుబంధు ఎప్పటి నుంచి రైతులకు ఇస్తారో చెప్పాలంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ అన్ని హామీలపై ప్రభుత్వం త్వరిత గతిన స్పందిస్తే రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అభిప్రాయ పడ్డారు. అధికారపక్షం తమ పనిని ఎలాగైతే ప్రారంభించారో.. ప్రతిపక్షం కూడా తమపాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే.. మొదట ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత సభను 14వ తేదీకి వాయిదా వేశారు. మరి.. హరీశ్ రావు చేసిన తొలి డిమాండుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.