Idream media
Idream media
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్.. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాస్ లీడర్లు, ప్రతిభాపాటవాలతో పేరు తెచ్చుకున్న వారి కన్నా.. జలీల్‌ఖాన్ ప్రజల నోళ్లలో ఎక్కువనానారు. బి.కాంలో ఫిజిక్స్ చదవివానని చెప్పి.. ఫేమస్ అయ్యారు. 2014లో వైసీపీ తరపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన జలీల్‌ఖాన్ 2019 ఎన్నికల్లో తన కుమార్తెను పోటీలో నిలబెట్టారు. వైసీపీ తరపున పోటీచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఎన్నికల తర్వాత జలీల్ ఖాన్ దాదాపు సైలెంట్ అయ్యారు.
అయితే తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. మంత్రి వెల్లంపల్లిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వెల్లంపల్లి పచ్చిఅబద్ధాలకోరు అని, విశ్వాసం లేని వ్యక్తి అని ఘాటు విమర్శలు చేశారు. 2009లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుంటే ఎమ్మెల్యే అయ్యేవాడే కాదని, ఐపీ పెట్టి వెళ్లిపోయేవాడంటూ జలీల్ ఖాన్ వెల్లంపల్లిపై ఫైర్ అయ్యారు. జలీల్‌ఖాన్‌కు ఈ స్థాయిలో ఆగ్రహం రావడానికి కారణం.. తాను తెచ్చిన జూనియర్ కాలేజీని వెల్లంపల్లి తెచ్చారని చెప్పుకుంటున్నారట. పైకి ఈ కారణం చెబుతున్నా.. లోపల ఇతర కారణాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే.
విశ్వాసం అందరూ చూపాలి..
తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబట్టే 2009లో వెల్లంపల్లి ఎమ్మెల్యే అయ్యాడని, కాబట్టి తన పట్ల విశ్వాసం చూపాలనేది జలీల్‌ఖాన్ వాదన. ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. నేను పోటీ చేయడం వల్ల ఓట్లు చీలాయి కాబట్టి ఆ నేత ఎమ్మెల్యే అయ్యాడు అంటే.. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమీకరణాలు ఉంటాయి. జలీల్‌ఖాన్ మాదిరిగా ప్రతి నియోజకవర్గంలో పోటీచేసిన వారికి అంతో ఇంతో ఓట్లు వస్తాయి. తాను పోటీచేయడం వల్ల ఓట్లు చీలి ఎమ్మెల్యే అయ్యావు.. కాబట్టి నా పట్ల విశ్వాసంగా ఉండు అని జలీల్‌ఖాన్ మాదిరిగా అంటే.. దాదాపు ప్రతి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన వారి పట్ల విశ్వాసం చూపాలి. మీ వల్లే ఎమ్మెల్యేను అయ్యానని వారు నిత్యం చెప్పుకోవాలి.
జలీల్ నోట.. విశ్వాసం మాట..
వెల్లంపల్లి విశ్వాసంలేని వ్యక్తి అంటూ జలీల్‌ఖాన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడం వల్ల వెల్లంపల్లి గెలిచాడు.. ఆ విశ్వాసం చూపడంలేదని జలీల్‌ఖాన్ అంటే.. టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేసిన పార్టీని వదిలేసి స్వప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి ఫిరాయించిన వారిని ఏమనాలో..? జలీల్‌ఖాన్ సెలవియ్యాలి. 1999లో జలీల్‌ఖాన్ తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ జలీల్‌ఖాన్‌కు టిక్కెట్ దక్కలేదు. అలాంటి జలీల్‌ఖాన్‌కు వైసీపీ.. నియోజకవర్గ కో ఆర్డినేటర్ పదవి, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి.. అసెంబ్లీకి పంపింది. మళ్లీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వదిలి రెండేళ్లకే టీడీపీ పంచన చేరిన జలీల్‌ఖాన్‌ను విశ్వాసం లేని వ్యక్తి అంటే ఆ పదం చిన్నది అవుతుందని వెల్లంపల్లి అనుచరులు విమర్శిస్తున్నారు.