iDreamPost
android-app
ios-app

ఈటెల రాజేందర్‌ భార్య సంచలన వ్యాఖ్యలు.. ‘నా భర్త హత్యకు కుట్ర జరుగతోంది’!

  • Published Jun 27, 2023 | 2:44 PM Updated Updated Jun 27, 2023 | 2:44 PM
  • Published Jun 27, 2023 | 2:44 PMUpdated Jun 27, 2023 | 2:44 PM
ఈటెల రాజేందర్‌ భార్య సంచలన వ్యాఖ్యలు.. ‘నా భర్త హత్యకు కుట్ర జరుగతోంది’!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. చేరికలు, సీనియర్ల మధ్య విబేధాలతో.. అన్ని పార్టీల్లో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్.. కాషాయ పార్టీని వీడబోతన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటెల రాజేందర్‌ భార్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. తన భర్త హత్యకు కుట్ర జరిగిందని ఈటెల రాజేందర్‌ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో.. హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఈటెలను హత్య చేయడానికి రూ.20 కోట్లు కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారని..కేసీఆర్ ప్రోత్సాహకంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారంటూ ఈటెల భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశౠఉ. మహిళల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెడలో చెప్పుల దండ వేస్తారని జమున మండిపడ్డారు. కేసీఆర్ తమను ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. జమున సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈటెలకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు పయనమయ్యారు. అక్కడే రెండురోజుల పాటు ఉన్న ఈటెల.. అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఈటెల ఢిల్లీ పర్యటన ఉద్దేశం మాత్రం బయటకు తెలియలేదు. ఈ క్రమంలో ఈటెల భార్య జమున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap