Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక తాజాగా కాంగ్రెకస్ అభ్యర్థి జి.వివేక్‌కి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కంపెనీ నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక తాజాగా కాంగ్రెకస్ అభ్యర్థి జి.వివేక్‌కి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కంపెనీ నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఓవైపు పార్టీలు, అభ్యర్థులు ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉండగా.. మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా అదే స్థాయిలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అభ్యర్థుల ఇళ్ల మీద వరుసగా దాడులు చేస్తూ.. సోదాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్‌కి తాజాగా దర్యాప్తు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. ఆయనకు చెందిన సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వివేక్‌కు చెందిన కంపెనీల నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ చిక్కులో పడ్డారు. ఆయనకు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా రూ.100 కోట్ల నగదు అక్రమ బదిలీ జరిగినట్లు.. ఈడీ దర్యాప్తులో తేలింది. వివేక్ బ్యాంకు అకౌంట్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు రూ.8 కోట్లు తరలించినట్లు ముందుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం వివేక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అక్కడ లభించిన ఆధారాలను బట్టి వివేక్, అతడి భార్య నిర్వాహకులుగా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు.
ఇక తాజాగా వివేక్ ఇంట్లో సోదాలపై స్పందిస్తూ.. ఈడీ ట్వీట్ చేసింది. ‘‘ఫెమా, 1999 నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద్ నివాసాలతో పాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించాము. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక నివాసాల్లో కూడా సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు’ అని ట్వీట్ చేసింది.
తమ సోదాల్లో.. మొత్తంగా రూ.200 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు రూ.20 లక్షలు ట్యాక్స్ చెల్లించలేదని సమాచారం. అంతేకాక వివేక్ బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు సొమ్ము తరలింపు జరిగిందని.. ఈ బదిలీలో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
మొత్తంగా సంస్థలో రూ.200 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అయితే విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని తమ దర్యాప్తులో వెల్లడైంది అన్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ సైతం వివేక్ నియంత్రణలోనే ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. దాంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో జి. వివేక్‌పై ఈడీ కేసు నమోదు చేయటం కలకలం రేపుతోంది. ఆయన బీజీపీ నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈడీ రంగంలోకి దిగటం కూడా చర్చనీయాంశమైంది.
ED conducted searches under the provisions of the FEMA, 1999 at four locations in Telangana on 21.11.2023 at the residences of Dr. Gaddam Vivekanand at Hyderabad as well as the office premises of Visaka Industries Ltd. in Hyderabad and Vigilance Security Services Pvt. Ltd. at…
— ED (@dir_ed) November 22, 2023