Arjun Suravaram
Ravinder Chandrasekar: ప్రముఖ రవీందర్ చంద్రశేఖర్ నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం నటి మహాలక్ష్మి శంకర్ ను వివాహం చేసుకోవడంతో రవీందర్ పాపులర్ అయ్యారు.
Ravinder Chandrasekar: ప్రముఖ రవీందర్ చంద్రశేఖర్ నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం నటి మహాలక్ష్మి శంకర్ ను వివాహం చేసుకోవడంతో రవీందర్ పాపులర్ అయ్యారు.
Arjun Suravaram
సినీ, రాజకీయ ప్రముఖల ఇళ్లలో ఈడీ, ఏసీబీ అధికారులు తరచూ తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రకాల సమాచారాన్ని సదరు ప్రముఖల నుంచి సేకరిస్తుంటారు. లెక్క చూపని ఆస్తులను,నగదును సీజ్ చేస్తుంటారు. తాజాగా కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖర్ నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
తమిళ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గురించి సినిమాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుమారు రెండేళ్ల క్రితం నటి మహాలక్ష్మి శంకర్ ను వివాహం చేసుకున్నారు. అప్పటి వరకు బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రవీందర్.. ఆపెళ్లితో బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఆ దంపతులకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. వాటిపై మహాలక్ష్మి, రవీందర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే..కొద్దిరోజుల క్రితం ఒక బిజినెస్ మెన్ ను దాదాపు రూ.16 కోట్ల మేర మోసం చేశాడనే ఫిర్యాదులతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది.
ప్రస్తుతం ఆయన ఆ కేసు విషయంలో బెయిల్ పై బయటకు వచ్చారు. రవీందర్ లిబ్రా అనే సినిమా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థకు అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా పలు సినిమాలను రవీందర్ నిర్మించారు. తాజాగా ఆయన ఇంటో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం రవీందర్ చెన్నైలోని అశోక్ నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ఆయన ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా నగదు బదిలీ చేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మన్సిపల్ సాలిడ్ వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ లో బాలాజీ అనే వ్యక్తితో రూ.16 కోట్లు పెట్టుబడి పెట్టించి.. ఆపై అతన్ని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కేసులు జైలుకు వెళ్లిన రవీందర్ ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై బయట ఉన్నారు. తాజాగా ఆ రూ.16కోట్ల మోసం కేసులో అక్రమ నగదు మార్పిడికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఆ మేర కు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రవీందర్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు ఏమైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.