Dharani
తెలంగాణలో ఎలక్షన్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. భారీ ఎత్తున నగదు, బంగారాన్ని తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. మరి ఇలా సీజ్ చేసిన సొత్తు పొందాలంటే ఏం చేయాలి.. ఎలా తిరిగి తెచ్చుకోవాలంటే..
తెలంగాణలో ఎలక్షన్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. భారీ ఎత్తున నగదు, బంగారాన్ని తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. మరి ఇలా సీజ్ చేసిన సొత్తు పొందాలంటే ఏం చేయాలి.. ఎలా తిరిగి తెచ్చుకోవాలంటే..
Dharani
తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. ఈ ఏడాది నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు, విలువైన లోహాల తరలింపుకు సంబంధించి అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి.. తెలంగాణవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూసే వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. ఇక 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన పది రోజుల్లోనే.. ఏకంగా 130 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చన నాటి నుంచి పోలీసులు తనిఖీల కారణంగా సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. దీనిపై విమర్శలు కూడా వస్తుండటంతో.. తాజాగా దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. సీజ్ చేసిన సొత్తును తిరిగి పొందేందుకు జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వీటిని సంప్రదించడం ద్వారా సీజ్ చేసిన సొత్తును తిరిగి పొందవచ్చని వెల్లడించింది. ఇందుకు ఏం చేయాలంటే..
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా రూ. 50 వేల వరకు నగదు, 10 గ్రాముల బంగారాన్ని మించి ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అయితే దీని వల్ల వ్యాపారులు, హవాలా సొమ్ము తరలించేవారితో పాటు.. సామాన్యుల దగ్గర ఉన్న సొత్తును సైతం పోలీసులు సీజ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న ఓ కుంటుబం పెళ్లి కోసం తీసుకెళ్తున్న బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగు చూడటంతో.. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
విమర్శల నేపథ్యంలో డబ్బు, నగదు తరలింపుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇలా రికవరీ చేసిన సామాన్యుల సొమ్మును బాధితులకు తిరిగి ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే.. 48 గంటల్లోనే వాటిని తిరిగిచ్చేస్తామని ప్రకటించింది. అయితే ఇలా సీజ్ చేసిన సొత్తు విలువ రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని ఈసీ నిబంధన పెట్టింది. అంతకు మించి విలువైన సొత్తు ఉంటే.. ఐటీ అధికారులకు వివరాలు వెల్లడించాలని సూచించింది.