iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు రాజకీయ నేతలను గుర్తుపట్టారా..?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు రాజకీయ నేతలు ఉన్నారు. వారెవరో గుర్తు పట్టారా..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు రాజకీయ నేతలు ఉన్నారు. వారెవరో గుర్తు పట్టారా..

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు రాజకీయ నేతలను గుర్తుపట్టారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని హస్తం పార్టీకి అధికారాన్ని అప్పగించారు అక్కడి ప్రజలు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఏకంగా సీఎం కుర్చీని అధిరోహిస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఓ పాత పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చాలా కాలం నాటిది. ఇందులో ఇద్దరు రాజకీయ నేతలు ఉన్నారు. వారిని గుర్తు పట్టారా.. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు వల్లభనేని వంశీమోహన్.

ఈ ఇద్దరూ గతంలో టీడీపీలో నేతలుగా ఉన్నారు. అప్పట్లో వీరిద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తీసుకున్న ఫోటో అది. అప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే కాగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీరిద్దరూ టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం విడిపోయాక.. టీడీపీని వీడి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు రేవంత్ రెడ్డి. 2018లో జరిగిన ఎన్నికల్లో కొండగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అయినప్పటికీ పోరాట యోధుడిగానే కొనసాగారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల కోసం ప్రతిపక్ష నాయకుడి హోదాలో అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెట్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి పని తీరు నచ్చి.. 2021లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అక్కడి  నుండి జీవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ గెలుపొందేందుకు శాయ శక్తులా ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా తీసుకెళ్లడంతో పాటు.. తమ హామీలు ప్రజల్లోకి వెళ్లేలా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు జైజైలు పలికారు తెలంగాణ బిడ్డలు. అధికారాన్ని కట్టబెట్టారు. పార్టీకి ఆయన చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం.. సీఎం కుర్చీని బహుమతిగా అందించింది. ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.