iDreamPost
android-app
ios-app

బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్‌ నేత జీవన్‌ ర్డెడి.. మరీ ఇంత అహంకారామా?

  • Published Oct 20, 2023 | 3:36 PMUpdated Oct 20, 2023 | 3:36 PM

తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అయితే విమర్శలు పార్టీల పరంగా ఉంటే పర్లేదు కానీ.. హద్దు దాటితే మాత్రం ప్రమాదం. తాజాగా కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అయితే విమర్శలు పార్టీల పరంగా ఉంటే పర్లేదు కానీ.. హద్దు దాటితే మాత్రం ప్రమాదం. తాజాగా కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

  • Published Oct 20, 2023 | 3:36 PMUpdated Oct 20, 2023 | 3:36 PM
బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్‌ నేత జీవన్‌ ర్డెడి.. మరీ ఇంత అహంకారామా?

తెలంగాణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ.. తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగకు చారిత్రక నేపథ్యం మాత్రమే కాక.. రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఎంతటి కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. బతుకమ్మ పండుగకు మరింత ప్రాధాన్యత పెరిగింది. దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు.. ఆడపడుచులంతా ఒక్క చోట చేరి.. ఎంతో సంబురంగా బతుకమ్మను ఆడతారు. అయితే తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ గురించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన ‘బతుకమ్మ’ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవమానపరిచారు. రేపటి రోజున బీఆర్ఎస్ పాలన వస్తే బతుకమ్మలను పేర్చినప్పుడు గౌరమ్మ బదులు దాని మీద లిక్కర్ బాటిల్ పెడతారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలో గురువారం నాటి కాంగ్రెస్ ప్రచార సభలో మాట్లాడిన జీవన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విమర్శించే నేపథ్యంలో.. బతుకమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ, గౌరమ్మలను ఉద్దేశించి.. జీవన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనాలు మండి పడుతున్నారు. విమర్శలు చేయాలనుకుంటే.. పార్టలపరంగా చూసుకొండి కానీ.. తెలంగాణ ఆడబిడ్డల మనోభావాలను దెబ్బ తీయడం ఎంత వరకు సమంజసం అంటూ మండిపడుతున్నారు.

అంతేకాక రాజకీయాల్లో ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్‌ రెడ్డి లాంటి సీనియర్‌ నేత.. బతుకమ్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదు అంటున్నారు జనాలు. తెలంగాణ ఇంటి ఆడపడుచు బతుకమ్మను అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్తలే ఇలా మాట్లాడితే, సాధారణ నాయకుల నోటికి అడ్డువేయగలమా అని మండిపడుతున్నారు. అటు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పెను దుమారం రేగుతోంది. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే అడుక్కునేవాళ్లు అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా జనాలు మండిపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి