iDreamPost
android-app
ios-app

CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నియోజకవర్గానికో గురుకుల పాఠశాల!

CM Revanth Reddy- Young India Integrated Residential Schools: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. ఆ సమయంలో మరోసారి రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఎకరాల్లో ఒక పాఠశాల చొప్పున నిర్మిస్తామని తెలిపారు.

CM Revanth Reddy- Young India Integrated Residential Schools: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. ఆ సమయంలో మరోసారి రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఎకరాల్లో ఒక పాఠశాల చొప్పున నిర్మిస్తామని తెలిపారు.

CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నియోజకవర్గానికో గురుకుల పాఠశాల!

కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఏ ప్రభుత్వమైనా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. విద్య కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే విద్య కోసం చేసేది ఖర్చు కాదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్ పిల్లలకు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక శుభవార్తను అందించారు. ప్రతి నియోజకవర్గానికి యూనివర్సిటీ తరహాలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో గురుకుల పాఠశాలల ఆవశ్యకతను ప్రస్తావించారు. అలాగే తాము త్వరలోనే నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. ఏకంగా 25 ఎకరాల్లో అన్ని వసతులతో ఈ గురుకుల పాఠశాలలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా విద్య నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో కూడా విద్యకు న్యాయం జరగలేదు అన్నారు. అందుకే విద్యకు న్యాయం చేయాలని నిధుల కేటాయింపును పెంచామని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు సరిపోవు అనుకుంటే.. భవిష్యత్తులో నిధులు పెంచుతామంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం గురుకుల పాఠశాలల గురించి గొప్పగా చెప్పుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ స్కూల్స్ తెచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారన్నారు. వాటిని మంజూరు చేశారు. కానీ, ఆ పాఠశాలలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఆ గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు, భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. తమ ప్రభుత్వం త్వరలోనే… యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించబోతున్న విషయాన్ని వెల్లడించారు. SC, ST, OBC, మైనారిటీకి సంబంధించి ఈ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏకంగా 25 ఎకరాల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల క్యాంపస్ ఉంటుందన్నారు.

ఈ గురుకులాల్లో మౌలిక వసతులు, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్స్ ఉంటాయన్నారు. విద్యార్థులకు మంచి విద్యే కాదు.. మంచి భోజన సదుపాయాలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే ఈ గురుకులాల పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొడంగల్, మధిరలో పనులు ప్రారంభించామన్నారు. హైదరాబాద్ నియోజకవర్గాలను మినహాయిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఉన్న 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తాయన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు 120 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియస్ స్కూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.