iDreamPost
android-app
ios-app

CM Revanth: మూసీ వెంబడి కూల్చివేతలపై CM రేవంత్ రెడ్డి ఎమోషనల్!

CM Revanth Emotional Comments On Musi Demolitions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మూసీ నిర్వాసితుల గురించి ప్రస్తావించారు. ఆయన మూసీ ఆక్రమణలు, ప్రక్షాళణ, సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Emotional Comments On Musi Demolitions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మూసీ నిర్వాసితుల గురించి ప్రస్తావించారు. ఆయన మూసీ ఆక్రమణలు, ప్రక్షాళణ, సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth: మూసీ వెంబడి కూల్చివేతలపై CM రేవంత్ రెడ్డి ఎమోషనల్!

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నది వెంబడి నివాసాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించింది. అలాగే అదనంగా ప్రతి కుటుంబానికి రూ.25 వేలు నగదు కూడా ఇస్తోంది. నిర్వాసితులకు జీవనోపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చుస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కంటోన్మెంట్ లో డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మరోసారి మూసీ నిర్వాసితుల గురించి సీఎం రేవంత్ స్పందించారు. మూసీ నది మురికి, దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవాల్లా మారుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ, కూల్చివేతలకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “హైదరాబాద్ నగరంలో నీళ్లు అడుగంటిపోయాయి. 2 వేల ఫీట్లు బోర్లు వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వచ్చింది. రాజకీయంగా నాకు తెలుసు.. కొందరు పేదలకు కష్టం వచ్చింది. మధ్యతరగతి వాళ్లు జీవితాంతం సంపాదించుకున్నది కోల్పోతున్నారు. అధికారులు వచ్చి ఇళ్లు కూలగొడితే ఆ దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇలాగే వదిలేస్తే.. చెరువులు, నాళాలు, మూసీ ఆక్రమణలు కొనసాగుతాయి. మరి.. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వారిని తొలగిద్దాం. వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో సూచనలు ఇవ్వండి. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడాలి అనుకోవడం లేదు.

ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలి అనేదే మా ఆలోచన. మూసీలో ఆ దోమలు, ఆ కంపులో బతికేకంటే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నాం. వారికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నాం. వారికి ఉపాధి కల్పిస్తాం. నిర్వాసితుల పిల్లలకు చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈటల రాజేందర్ దుఃఖం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్లు మంచిగా బతకడం మీకు ఇష్టం లేదా? వాళ్లు ఎప్పటికీ పేదవాళ్లలాగానే ఉండాలా? వాళ్లు మూసీలోనే ఉండాలా? వాళ్లు మంచిగా బతికితే మీరు చూడలేరా?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అలాగే బఫర్ జోన్ బాధితులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

బఫర్ జోన్ లో కూల్చివేతల విషయంలో తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. FTL, బఫర్ జోన్లలో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. బాధితులను ఎలా ఆదుకోవాలో అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గొడ్డుపోలేదన్నారు. 7 లక్షల కోట్లు అప్పులైనా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. మొదటి ప్రణాళికగా మూసీ రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నాం. 25 వేల రూపాయలు నగదు ఇస్తున్నాం. ఇంకా ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచించండి. ఈటల రాజేందర్ మీరు ప్రధానితో చర్చించండి. మిమ్మల్ని ముందు వరుసలో ఉంచుతాం. మా మంత్రివర్గం మొత్తం మీ వెనుకే వస్తుంది. ప్రధానిని కలిసి మాట్లాడదాం. ఒక పాతికవేల కోట్ల నిధులు అడగండి.. పేదలను ఆదుకుందాం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.