iDreamPost
android-app
ios-app

ప్రధానితో CM రేవంత్- భట్టి విక్రమార్క భేటీ.. చేసిన విజ్ఞప్తులు ఇవే!

CM Revanth Reddy- Bhatti Vikramarka Met PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక విజ్ఞప్తులు చేశారు.

CM Revanth Reddy- Bhatti Vikramarka Met PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక విజ్ఞప్తులు చేశారు.

ప్రధానితో CM రేవంత్- భట్టి విక్రమార్క భేటీ.. చేసిన విజ్ఞప్తులు ఇవే!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలిశారు. వీరి భేటీ నేపథ్యంలో ఏం చర్చించారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ప్రధానితో దాదాపు గంటపాటు రేవంత్- భట్టి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు, విజ్ఞప్తులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకి వెల్లడించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కర్మాగారాలకు సంబంధించిన అన్ని విషయాలు స్పష్టంగా చర్చించినట్లు తెలిపారు.

సీఎం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి- భట్టి విక్రమార్క తొలిసారి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి పెడింగ్ నిధులు,  విభజన హామీలపై చర్చించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని భట్టి అన్నారు. అయితే విభజన హామీల అమలును మాత్రం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విభజన హామీలను త్వరిత గతిన పూర్తిచేయాలని ప్రధానిని కోరినట్లు భట్టి వెల్లడించారు. ముఖ్యంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్స్ మంజూరు చేయాలని కోరామన్నారు.

విభజన హామీల్లో తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరిన విషయాన్ని తెలిజేశారు. అలాగే జాతీయ రహదారులకు సంబంధించి మొత్తం 14 ప్రపోజల్స్ పెండింగ్ లోఉన్నాయన్నారు. వాటికి సంబంధించి త్వరిత గతిన  స్పందించాలని కోరామన్నారు. విభజనకు సంబంధించిన హామీల్లో వెనుకబడిన ప్రాంతులకు రావాల్సిన నిధులు చాలా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆ నిధులను మంజూరు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కోరినట్లు భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయ పడాలంటూ విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎంతో సానుకూలంగా స్పందించారంటూ భట్టి విక్రమార్క వివరించారు. అంతే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు ఇస్తామని ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రేవంత్ సర్కారుకు సంబంధించి ఈ విషయం కూడా మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కాకముందే రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ప్రజలతో మమేకమవుతూ రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.