iDreamPost
android-app
ios-app

HYDRA: ఢిల్లీలో హైకమాండ్ తో CM రేవంత్ భేటీ.. హైడ్రా దూకుడు తగ్గనుందా?

CM Revanth Reddy- Mallikarjun Kharge Discussion On Hydra: హైడ్రా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైడ్రా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy- Mallikarjun Kharge Discussion On Hydra: హైడ్రా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైడ్రా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

HYDRA: ఢిల్లీలో హైకమాండ్ తో CM రేవంత్ భేటీ.. హైడ్రా దూకుడు తగ్గనుందా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. తాజాగా హైడ్రా విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కూడా అందరూ హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ లోనే కాదు.. ఢిల్లీలో కూడా ఇప్పుడు హైడ్రానే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యనటలో ఉన్నారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఈ సమయంలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే- సీఎం రేవంత్ మధ్య హైడ్రాకి సంబంధించి కీలక చర్చ జరగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరూ హైడ్రా దూకుడు తగ్గనుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీకి హైడ్రాకి ఉన్న లింక్ ఏంటి? నిజంగానే హైడ్రా దూకుడు తగ్గనుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జడున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపుగా గంటసేపు జరిగింది. ఈ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖంగా ఖర్గే హైడ్రా గురించి ఆరా తీసినట్లు చెబుతున్నారు. తాజాగా హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి అంటూ మందలించింది. అంతేకాకుండా.. అసలు హైడ్రాకి ఉన్న చట్టబద్ధత ఏంటని సూటిగా ప్రశ్నించింది. మీరు ఎందుకు సెలవు దినాల్లో కూల్చివేతలు చేస్తున్నారు? అని మండిపడింది. చట్టాలకు లోబడకుండా కూల్చివేతలు చేస్తున్నారని హైకోర్టు మండిపడింది. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారా? అసలు సమయం ఇవ్వకుండా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కూడా హైడ్రాకి సంబంధించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఈ భేటీలో సీఎం రేవంత్ హైడ్రా ఆవశ్యకతను ఖర్గేకి వివరించారు. చెరువులు, నాళాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా తోడ్పడుతుందని సీఎం వివరించినట్లు తెలుస్తోంది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ సర్వే గురించి ఖర్గే వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పారని తెలుస్తోంది. ప్రజావ్యతిరేకత రాకుండా చూసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అందుకోసం కాస్త దూకుడు తగ్గించాలని సీఎం రేవంత్ కి సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైడ్రా దూకుడు తగ్గనుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాస్త ప్రజా వ్యతిరేకత తగ్గే వరకు కూల్చివేతలకు బ్రేక్ వేస్తారని చెబుతున్నారు.

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, హైకమాండ్ సూచలన నేపథ్యంలో ఇలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఆక్రమణలో విషయంలో మాత్రం హైడ్రా దూకుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పేదల ఇళ్ల జోలికి హైడ్రా రాదు అని తాజాగా కూడా రంగనాథ్ స్పష్టం చేశారు. నగరంలో జరిగే ప్రతి కూల్చివేతకు హైడ్రాకి సంబంధం ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే హైడ్రా దూకుడు తగ్గేలా కనిపించడం లేదు అంటున్నారు. మల్లికార్జున ఖర్గే- సీఎం రేవంత్ భేటీలో దసరాకు మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరి.. హైడ్రా దూకుడు నిజంగానే తగ్గనుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.