ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స

Kalvakuntla Kavitha: తాజాగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైయారు. దీంతో వెంటనే ఆమెను తీహర్ జైలు అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం కవిత అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Kalvakuntla Kavitha: తాజాగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైయారు. దీంతో వెంటనే ఆమెను తీహర్ జైలు అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం కవిత అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. తీవ్రమైన జ్వరం, నీరసంతో బాధపడుతు కళ్లు తిరిగి పడిపోయారని ఇది గమనించి తీహార్ జైలు అధికారులు వెంటనే   ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. అయితే కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం  కవిత ఎయిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక కోలుకున్న తర్వాత మళ్లీ కవితను తీహార్ జైలుకు తరలించనున్నామని జైలు అధికారులు తెలిపారు.

ఇకపోతే  గతంలో కూడా కవిత తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిదే. దీంతో అప్పుడు కూడా ఆమెను జైలుల అధికారలు ఢిల్లీలోని దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స తీసుకున్న కవిత కొన్ని రోజులు కొలుకున్నారు. కానీ, తాజాగా మరో మారు ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కవిత కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనలో పడుతున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతంలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంతటి సంచలనం సృష్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయి పలుమార్లు సీబిఐ విచారణకు హాజరైన కవితను నిందుతురాలిగా సీబీఐ కేసు నమోదు చేసింది.  ఈ క్రమంలోనే 5 నెలలగా కవిత జైలులో ఉన్నారు. అలాగే ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

అయితే మరోవైపు కవిత అనారోగ్యం కారణంగా.. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే  ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా.. ఈడీ చేయలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. అంతేకాకుండా..  శుక్రవారం లోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక వచ్చే మంగళవారానికి ఆగస్ట్ 27 కు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

Show comments