క్యాన్సర్‌తో బాధపడుతూ.. బీజేపీ నేత మృతి

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బీహార్‌ లోని బీజేపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో పోరాటం చేస్తోన్న బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ కన్నుమూశారు.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బీహార్‌ లోని బీజేపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో పోరాటం చేస్తోన్న బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ కన్నుమూశారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బీహార్‌ లోని బీజేపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో పోరాటం చేస్తోన్న బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ (72) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నెల రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో.. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.అయితే మహమ్మారి బారిన పడిన ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయాత్నాలు చేసిన ఫలించలేదు. అయితే పార్టీ కోసం ఎంతగానో కృషి చేసిన సీనియర్‌ నేత మరణం బీజేపీ పార్టీకి తీరని లోటుగా మిగిల్చింది. ఇదిలా ఉంటే.. సుశీల్‌ మోడీ తనకు కేన్సర్‌ సోకిన విషయాన్ని గత నెలలో బయటపెట్టిన విషయం తెలిసిందే.

కాగా, ఆయనకు ఆరు నెలల కిందటే కేన్సర​్‌ వ్యాధి నిర్దారణ అయ్యిందని, అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నానని ఇదివరకే ఆయన తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. బిహార్‌లో బీజేపీకి కీలక నేతగా ఉన్న సుశీల్ మోడీ.. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా.. తాను ఎన్నికల్లో పోటీచేయడం లేదని ఏప్రిల్ 3 సుశీల్ మోడీ ఎక్స్‌లో తెలిపారు. అలాగే అన్ని విషయాలు ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశామని.. ఎల్లప్పుడూ దేశం, బిహార్, పార్టీకి నేను అంకితం’’ అని వెల్లడించారు. అయితే మూడు దశాబ్దాలుగా పార్టీపై ఆయన గణనీయమైన ప్రభావాన్ని చూపిన ఆయన మరణం బిహార్‌లో బీజేపీకి తీరనిలోటు.

ఇక నితీశ​ మోడీ 2005 నుంచి 2020 మధ్య 11 ఏళ్ల పాటు క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.అలాంటి సీనియర్‌ నేత కేన్సర్‌ పోరాడుతూ.. ఢిల్లీలోనీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సోమవారం రాత్రి మరణించారు. కాగా, సుశీల్‌ కుమార్‌ మోడీ మరణం పై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్‌లు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ రోజు బిహార్ గొప్ప నాయకుడ్ని కోల్పోయింది.. ఏబీవీపీ నుంచి బీజేపీ వరకూ పార్టీతోపాటు ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవులను అలంకరించారు.ఇకపోతే.. ఆయన రాజకీయాలు పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకే అంకితమయ్యాయి.’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. అలాగే సుశీల్ మోదీ మరణంపై పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌లు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Show comments