Idream media
Idream media
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుగుణంగానే తుది ఫలితాలు వెల్లడవుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మిజోరం, గోవాలో ఫలితాలు హంగ్ దిశగా వస్తున్నాయి.
పంజాబ్‌లో 117 స్థానాలలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతోంది. 10:30 గంటల సమయానికి ఆప్ 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలిదల్ 11 చోట్ల, బీజేపీ కూటమి 5 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూసుకువెళుతోంది. 403 సీట్లకు గాను ఇప్పటి వరకు బీజేపీ 252 సీట్లలో, ఎస్పీ 132 చోట్ల, బీఎస్పీ 7, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరపార్టీలు మరో 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాల్లో లెక్కింపు మొదలైంది. బీజేపీ 43 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 23, ఇతర పార్టీలు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
గోవాలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు 35 చోట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 14 సీట్లలో, టీఎంసీ కూటమి ఐదు స్థానాల్లోనూ, ఆప్ ఒక చోట, ఇతర పార్టీలు మరో రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా.. బీజేపీ 26 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 13 స్థానాల్లోనూ, ఎన్‌పీపీ ఏడు, జేడీయూ ఐదు సీట్లలోనూ, ఇతర పార్టీలు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.