iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాల ఫలితాలు : పంజాబ్‌లో ఆప్‌.. యూపీలో బీజేపీ ముందంజ..

  • Published Mar 10, 2022 | 9:02 AM Updated Updated Mar 11, 2022 | 6:33 AM
  • Published Mar 10, 2022 | 9:02 AMUpdated Mar 11, 2022 | 6:33 AM
ఐదు రాష్ట్రాల ఫలితాలు : పంజాబ్‌లో ఆప్‌.. యూపీలో బీజేపీ ముందంజ..

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలకు అనుగుణంగానే ఎగ్జాట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడవుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

పంజాబ్‌లో 117 స్థానాలు ఉండగా.. 72 చోట్ల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు ఆప్‌ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలిదల్‌ 8 చోట్ల, బీజేపీ కూటమి 3 స్థానాల్లోనూ అధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూసుకువెళుతోంది. 403 సీట్లకు గాను ఇప్పటివరకు 237 చోట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీ 142, ఎస్పీ 85, బీఎస్పీ 5, కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు 62 చోట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీ 31 చోట్ల, కాంగ్రెస్‌ పార్టీ 29, ఆప్, ఇతరుల ఒక్కొక్క స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో రెండు జాతీయ పార్టీలు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

గోవాలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు 35 చోట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీ 14 చోట్ల, కాంగ్రెస్‌ 17 సీట్లలో, టీఎంసీ రెండు స్థానాల్లోనూ, ఇతర పార్టీలు మరో రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా.. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 14 స్థానాల్లోనూ, స్థానిక పార్టీలు ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetovis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom