Idream media
Idream media
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు రాష్ట్ర రిటైర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్ నేతృత్వంలో ‘కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం)’ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో పర్యటించిన అనంతరం ఏపీలోని సచివాలయ, వలంటీర్ల తరహా వ్యవస్థలు దేశమంతటా అమలుచేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇటీవల ఏపీలో పర్యటించింది. ఇక్కడ అమలమవుతున్న గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఆయా రాష్ట్రాల్లో కూడా అమలుచేస్తే బాగుంటుందని ప్రతిపాదించాయి.
దేశంలో ప్రజల జీవనప్రమాణాలు మరింత పెంచేందుకు తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తోంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తప్పనిసరి. ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా మరే రాష్ట్రంలోనూ లేదు.
– ఓ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ) సీనియర్ కన్సల్టెంట్.
ఎవరైనా ఏదైనా పని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పూర్తయితే అతనికి తక్కువలో తక్కువ రూ.500 అయినా మిగిలినట్టే. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీ వాసులు ఆ సౌలభ్యం పొందుతున్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు.
– ఓ ఆర్థిక శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన అద్భుత వ్యవస్థ పనితీరు ఫలితంగా ఆయన దేశానికి రోల్ మోడల్ గా మారుతున్నారనడం అతిశయోక్తి కాదు. ఆయన శ్రీకారం చుట్టిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థ దేశం మొత్తం అందుబాటులోకి వస్తే బాగుంటుందని కరోనా సమయంలో స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పటి నుంచీ ఏపీపై దృష్టి సారించారు. ఏపీకి తమ రాష్ట్ర ప్రతినిధి బృందాలను అధ్యయనానికి పంపుతున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, కేంద్ర ప్రతినిధులైనా ఏపీ తీరును ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విధానాలను దేశమంతా అవలంబిస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారు.
17 ఏళ్లుగా కేంద్రానికి సాధ్యం కానిది..
కేంద్రంలో పంచాయతీ రాజ్‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2005లో మొదటిసారిగా ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశమంతటా గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. దేశమంతటా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస స్థాయిలో ఫర్నిచర్, ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటోంది. కంప్యూటర్ నిర్వహణకు కనీసం కాంట్రాక్టు పద్దతిలోనైనా ఉద్యోగుల నియామకం చేయాలనుకుంది. ప్రతి గ్రామంలో ‘కామన్ సర్వీసు సెంటర్లు’ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తీరణ అభియాన్ (ఆర్‌జీపీఎస్‌ఏ), ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ)’ పేర్లతో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే 2.78 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం గ్రామ పంచాయతీ భవనం లేని చోట్ల వాటి నిర్మాణం, ఉన్న చోట మరమ్మతులకు ఈ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ గత 17 ఏళ్లుగా అనుకున్న రీతిలో ఫలితాలు సాధించలేదు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల్లో గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరిచొప్పున వలంటీర్లను నియమించారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. కేవలం నాలుగు నెలల్లోనే అద్భుత వ్యవస్థను స్థాపించారు