iDreamPost
android-app
ios-app

ఏపీ బడ్జెట్‌.. సంక్షేమ, అభివృద్ధిల సమ్మిళితం

  • Published Mar 11, 2022 | 11:23 AM Updated Updated Mar 11, 2022 | 12:10 PM
  • Published Mar 11, 2022 | 11:23 AMUpdated Mar 11, 2022 | 12:10 PM
ఏపీ బడ్జెట్‌.. సంక్షేమ, అభివృద్ధిల సమ్మిళితం

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ శాసనసభ ముందుకు వచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను, వేమన పద్యాలను చదివి వినిపించారు.

వివిధ రంగాలకు, సంక్షేమ పథకాలకు కేటాంయిపుల వివరాలను మంత్రి వెల్లడిస్తున్నారు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. నవరత్నాల పథకాల అమలుకు సంపూర్ణంగా నిధులు కేటాయించారు. విద్య, వైద్య పథకాలు, నాడు–నేడు కార్యక్రమానికి నిధులు కేటాయించారు. వ్యవసాయం, ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరిత్యాల నిధికి అధిక మొత్తంలో కేటాయింపులు చేశారు.

బడ్జెట్ స్వరూపం..

మొత్తం బడ్జెట్ – రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,08,261 కోట్లు
మూలధన వ్యయం – రూ. 47,996 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు – రూ. 48,724 కోట్లు

వివిధ వర్గాల సంక్షేమం కోసం..

వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం రూ. 18 వేల కోట్లు
బీసీ సంక్షేమం రూ. 20,962 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ రూ. 3,532 కోట్లు
ఈబీసీల సంక్షేమం రూ 6,639 కోట్లు
సోషల్ వెల్ఫేర్ 12,728 కోట్లు
ఈడబ్ల్యూఎస్ రూ. 10,201 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 6,145 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ రూ. 29,143 కోట్లు

వివిధ ప్రభుత్వ విభాగాలకు కేటాయింపులు..

వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
వైద్య శాఖ 15,384 కోట్లు
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
క్రీడల శాఖ రూ. 290 కోట్లు
పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
హోంశాఖ 7,586 కోట్లు
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు

సంక్షేమ పథకాల అమలు కోసం..

పెన్షన్‌ కానుక -రూ. 18 వేల కోట్లు
అమ్మ ఒడి-రూ. 6, 500 కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా -రూ. 3, 900 కోట్లు
జగనన్న విద్యా దీవెన -రూ. 2, 500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం -రూ. 500 కోట్లు
వైఎస్సార్‌ జగనన్న చేదోడు-రూ. 300 కోట్లు
వైఎస్సార్‌ వాహన మిత్ర-రూ. 260 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం- రూ. 199 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ. 120.49 కోట్లు
మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ-రూ. 50 కోట్లు
రైతుల ఎక్స్‌గ్రేషియా-రూ. 20కోట్లు
లా నేస్తం- రూ. 15 కోట్లు
జగనన్న తోడు-రూ. 25 కోట్లు
ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా – రూ. 6, 400 కోట్లు
వైఎస్సార్‌ చేయూత-రూ. 4, 235 కోట్లు
జగనన్న వసతి దీవెన -రూ. 2, 083 కోట్లు.
పీఎం ఫసల్‌ బీమా యోజన-రూ. 1, 802 కోట్లు
వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(అర్బన్‌) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
వైఎస్సార్‌ వడ్డీ రహిత రైతు రుణాలు-రూ. 500 కోట్లు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet