iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన హార్ట్ బీట్ సిరీస్‌.. హాలీవుడ్ సూపర్ హిట్ కాన్సెప్ట్ తో..

  • Published Mar 08, 2024 | 8:12 PM Updated Updated Mar 08, 2024 | 8:12 PM

Heart Beat Web Series: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులు ఎక్కువగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ కి బాగా అలవాటు పడ్డారు.

Heart Beat Web Series: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులు ఎక్కువగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ కి బాగా అలవాటు పడ్డారు.

OTTలోకి వచ్చేసిన హార్ట్ బీట్ సిరీస్‌.. హాలీవుడ్ సూపర్ హిట్ కాన్సెప్ట్ తో..

ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నయా ట్రెండ్ నడుస్తుంది. థియేటర్ కి వెళ్లి చూసేవారు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చుని సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వారం వారం కొత్త కొత్త వెబ్ సీరీస్, మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీకే జై కొడుతున్నారు మూవీ లవర్స్. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఎక్కువగా వెబ్ సీరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.. అలాంటి వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. కానీ హాస్పిటల్, డాక్టర్స్ నేపథ్యంలో పెద్దగా వెబ్ సీరీస్ రాలేదు. ఒకప్పుడు బుల్లితెరపై ఈ తరహా టీవీ సీరియల్స్ వచ్చాయి.. వాటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. చాలా కాలం తర్వాత ఆ తరహా వెబ్ సీరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీ వైపు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఓటీటీలో సరికొత్త కాన్సెప్ట్ తో వెబ్ సీరీస్, కొత్త సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాయి. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్ తోనే కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో భారతీయ చిత్రాలు మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన మాలీవుడ్ వెబ్ సీరీస్ పోచర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇది మెడికల్ జోనర్ లో అందరినీ బాగా ఆకట్టుకుంది. తాజాగా మరో సరికొత్త కంటెంట్ తో తెరకెక్కించిన వెబ్ సీరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సీరీస్ పేరే ‘హార్ట్ బీట్’. ఇది తమిళ వెర్షన్ వెబ్ సీరీస్.. మార్చి 8 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ యూత్ ఫుల్ సీరీస్ గా అలరించబోతుంది.

వాస్తవానికి ఈ సీరీస్ అమెరికన్ షో గ్రేస్ అనాటమి ఆధారంగా తెరకెక్కించారు. ట్రైనీ డాక్టర్ రీనా పాత్ర చుట్టు కథ తిరుగుతుంది. ఒక పెద్ద కార్పోరేట్ ఆస్పత్రిలో రీనా అనే ట్రైనీ డాక్టర్ మొదటి రోజే ఆలస్యంగా వస్తుంది. తన ప్రవర్తన వల్ల సీనియర్ డాక్టర్ రాధిక కోపానికి గురవుతుంది.. ఆ తర్వాత ఆమెకు ఎక్కడికి వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తనకు ఎదురయ్యే ఇబ్బందులను రీనా ఎలా సాల్వ్ చేసుకుంటుంది..? ఏం చేస్తుంది? ఆమె నేపథ్యం ఏంటీ ? అన్నదే కథ. ఈ సీరీస్ లో అనుమోలు, యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, గిరి ద్వారకేష్, జయరావు, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రేస్ అనాటమీ అనేది ఒక అమెరికన్ మెడికల్ డ్రామా.. ఇప్పటి వరకు 19 సీజన్లు పూర్తి చేసుకుంది. 2005, మార్చి 27 నుంచి ప్రారంభమైన ‘గ్రేస్ అనాటమీ’ సీరీస్ ఇంకా కొనసాగుతూ ఉండటం మరో విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil)