iDreamPost
android-app
ios-app

విశ్వక్ ‘గామి’ OTT- శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే!

  • Published Feb 27, 2024 | 4:38 PM Updated Updated Feb 27, 2024 | 4:38 PM

Gaami OTT Partner Fix: విశ్వక్ సేన్- విద్యాధర్ కాంబోలో వస్తున్న గామి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్లుగానే ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ని ఫిక్స్ చేసుకుంది.

Gaami OTT Partner Fix: విశ్వక్ సేన్- విద్యాధర్ కాంబోలో వస్తున్న గామి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్లుగానే ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ని ఫిక్స్ చేసుకుంది.

  • Published Feb 27, 2024 | 4:38 PMUpdated Feb 27, 2024 | 4:38 PM
విశ్వక్ ‘గామి’ OTT- శాటిలైట్ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. వరుస ప్రాజెక్టులు చేస్తూ.. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ని అలరిస్తూనే కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తుంటాడు. అలా చేసిన ఒక ప్రయోగమే ఈ గామి సినిమా. ఈ సినిమా గురించి 2017లోనే అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించుకుంది. ఇప్పుడు మార్చి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఒక హీరో, ఒక డైరెక్టర్ కు కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇన్నేళ్లుగా ఈ ప్రాజెక్టుని నమ్ముకుని పని చేస్తారు చెప్పండి. ఇప్పుడు అదే నమ్మకం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా కలిగిందని చెబుతున్నారు.

విశ్వక్ సేన్- విధ్యాధర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గామి. ఈ మూవీ పోస్టర్, టీజర్ అన్నీ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ కోసం విశ్వక్ సేన్ దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఇంక డైరెక్టర్ అయితే గత ఎనిమిదేళ్లుగా ఇదే కథతో ట్రావెల్ చేస్తున్నాడు. అలాంటి ఒక స్టోరీ మార్చి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతానికి సినిమా టీమ్ మొత్తం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

గామి మూవీ ట్రైలర్ ని ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నారు. అది కూడా పీసీఎక్స్ ఫార్మాట్ లో ప్రసాద్స్ లో లాంఛ్ చేయబోతున్నారు. ఇంక ఈ మూవీపై ఉన్న అంచనాలు, క్రియేట్ అవుతున్న హైప్ చూసి రిలీజ్ కి ముందే ఓటీటీ, శాటిలైట్స్ కొనేశారని చెబుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సంస్థ గామి మూవీకి సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అది కూడా ఒక మంచి ఫ్యాన్సీ రేటుకే అవి అమ్ముడయ్యాని టాక్ నడుస్తోంది. అదే నిజమైతే సినిమాపై గట్టి బజ్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. అందుకే ఇలా సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ని కొనుగోలు చేశారు.

ఇంక గామి సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ ఒక అఘోరా జర్నీ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అతని పర్పస్ ని అతను కనుక్కునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, అవి అధిగమించే తీరును ఆసక్తికరంగా తెరకెక్కించారు. నిజానికి విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8కి రావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా గామి మూవీ తెరపైకి వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా కొంత షూటింగ్ పూర్తి కావాల్సి ఉందని.. గామి అయితే విడుదలకు రెడీగా ఉందని.. అందుకే గామితో వస్తున్నాం అంటూ విశ్వక్ సేన్ స్వయంగా ప్రకటించాడు. ఫ్యాన్స్ మాత్రం ఎలా వచ్చినా పర్లేదు.. మార్చి 8కి వస్తే చాలు అంటున్నారు. మరి.. విడుదలకు ముందే గామి చిత్రం ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom