iDreamPost

OTTలోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ న్యూస్ వైరల్!

Maharaja Movie OTT: ఇటీవల విజయ్ సేతుపతి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మహారాజ. ఈ మూవీ థియేటర్లలో క్రియేట్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.

Maharaja Movie OTT: ఇటీవల విజయ్ సేతుపతి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మహారాజ. ఈ మూవీ థియేటర్లలో క్రియేట్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.

OTTలోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ న్యూస్ వైరల్!

నేటికాలంలో ఎంటర్టైన్మెంట్ లో ఓటీటీలదే అగ్రస్థానం అని చెప్పొచ్చు. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యే సినిమాలు కొన్నైతే..థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత ఓటీటీలోకి వచ్చే సినిమాలు మరికొన్ని ఉంటాయి. సినీ ప్రియులు అందరూ కూడా  ఎక్కువగా థియేటర్ లో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు థియేటర్ తో పాటు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇంకా థియేటర్లలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సూపర్ హిట్ సినిమాలో ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమా ఒకటే తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ. ఈ సినిమాకు సంబంధించి..తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. ఇటీవలే మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్14న  థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మాములు అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. స్ట్రైట్ సినిమాలను సైతం ఈ డబ్బింగ్ మూవీ క్రాస్ చేసి.. థియేటర్స్ లో ప్రేక్షకుల మధ్యన ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది.

మహారాజ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజయ్ సేతుపతి యాక్టింగ్ కి, డైరెక్టర్ మూవీ టెకింగ్ కి ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో చూసిన వాళ్లు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో జూలై 19 స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వైరల్ అవుతున్న ఈ న్యూస్ తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి.. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన మహారాజ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి