iDreamPost
android-app
ios-app

విడుదలైన కొన్ని రోజులకే OTTలోకి ఫ్యామిలీ స్టార్.. డేట్ కూడా లాక్ చేసేశారు!

  • Published Apr 13, 2024 | 7:16 PM Updated Updated Apr 13, 2024 | 7:16 PM

The Family Star OTT Release: విడుదలై నెలరోజులు కాకముందే.. విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ ను కూడా లాక్ చేశారట. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోందంటే?

The Family Star OTT Release: విడుదలై నెలరోజులు కాకముందే.. విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ ను కూడా లాక్ చేశారట. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోందంటే?

విడుదలైన కొన్ని రోజులకే OTTలోకి ఫ్యామిలీ స్టార్.. డేట్ కూడా లాక్ చేసేశారు!

విజయ్ దేవరకొండ-పరశురాం కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ గతంలో వీరిద్దరి కాంబోలో ‘గీతాగోవిందం’ వచ్చి.. 100 కోట్ల కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ వీరు కలిసి చేస్తున్న చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇన్ని అంచనాల నడుమ ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఫ్యామిలీ స్టార్. కుటుంబ విలువలతో కూడిన కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక విడుదలైన తొలిరోజు నుంచి డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ది ఫ్యామిలీ స్టార్. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీలో అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

విడుదలైన నెలరోజుల లోపే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. తొలుత రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ మూవీకి వచ్చిన స్పందన కారణంగా ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 3 నుంచి ది ఫ్యామిలీ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. ఇంత తొందరగా ఓటీటీలోకి రానుండటంతో ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. మరి థియేటర్లలో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ.. ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతాడో వేచిచూడాలి.

ఇదికూడా చదవండి: Ramayana: ‘రామాయణ’ కోసం యష్ సాహసం.. ప్రభాస్, తారక్ కూడా చేయని రిస్క్ ఇది!

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş