iDreamPost
android-app
ios-app

OTTలోకి లవ్ గురు.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Published May 11, 2024 | 12:07 PM Updated Updated May 11, 2024 | 12:07 PM

వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తాజాగా నటించిన చిత్రం.. లవ్ గురు. ఏప్రిల్లో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తాజాగా నటించిన చిత్రం.. లవ్ గురు. ఏప్రిల్లో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

  • Published May 11, 2024 | 12:07 PMUpdated May 11, 2024 | 12:07 PM
OTTలోకి లవ్ గురు..  ఎక్కడ చూడొచ్చంటే..

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది తమిళ ఇండస్ట్రీ. ఇక హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. వర్సటైల్ యాక్టింగ్ కోసం ఎంతైనా శ్రమిస్తారు. వారిలో ఒకరు విజయ్ ఆంటోనీ. మల్టీ టాలెంట్ అనే పేరుకు బ్రాండ్ అంబాసిడర్ ఈ స్టార్ హీరో. మ్యూజిక్ డైరెక్టర్ నుండి ప్లే బ్యాక్ సింగర్ ఆ తర్వాత యాక్టర్‌గా మారాడు. అంతేనా.. ఫిల్మ్ ఎడిటర్, లిరిసిస్ట్, ఆడియో ఇంజనీర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలో సగానికి పైగా క్రాఫ్ట్‌లో మంచి పట్టును సాధించిన ఈ నటుడు.. తమిళ్ డబ్బింగ్ మూవీ సలీమ్‌తో గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. 2016లో వచ్చిన పిచ్చైకారన్ (బిచ్చగాడు)తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది సీక్వెల్ తెరకెక్కించగా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది.

ఆయన తాజాగా నటించిన చిత్రం లవ్ గురు (రోమియో). విజయ్ బహూశా తొలిసారి రొమాంటిక్ జోనర్‌లో నటించిన చిత్రం. మృణాళిని రవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలైంది. స్వంత నిర్మాణ సంస్థ విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆంటోనీ నిర్మించారు. లవ్ గురు ట్రైలర్ చూడగానే.. కొత్త జానర్ ట్రై చేశాడు అనిపించింది ప్రేక్షకులకు. కానీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకలోలేదు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా అదే ఫలితం అందుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా వచ్చేసింది. మే 10 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా తమిళంతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.

Love Guru

ఈ సినిమాకు వినాయకన్ వైద్యానాథన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో కేఫ్ నడుపుతుంటాడు. ఆర్థిక సమస్యల నుండి కుటంబాన్ని బయటపడేసేందుకు కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. 35 ఏళ్లు వచ్చినా ప్రేమ, పెళ్లి అనే ఫేజ్ అతడి లైఫ్‌లో ఉండవు. ఇంతలో ఇండియాకు తిరిగి వస్తాడు అరవింద్. ఇంతలో బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. అతడి మనసు తెలుసుకున్న తల్లిదండ్రుల లీలా అమ్మానాన్నలతో సంబంధం మాట్లాడుతుంటారు. కానీ లీలాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఆమెకు పెళ్లి చేస్తారు. పెళ్లైయ్యాక..ఇష్టం లేని భర్తతో ఆమె ఎలా ప్రవర్తిస్తుంది. అసలు లీలాకు పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదో తెలియాలంటే.. ఓటీటీలో  లవ్ గురు స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet