iDreamPost
android-app
ios-app

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 చిత్రాలు.. ఆ నాలుగింటిపైనే అందరికి ఆసక్తి

  • Published Jul 29, 2024 | 10:13 AM Updated Updated Jul 29, 2024 | 10:13 AM

OTT Release Movies-July 29th To Aug 4th 2024: కొత్త వారం వచ్చింది.. దాంతో ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు కొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఆ వివరాలు..

OTT Release Movies-July 29th To Aug 4th 2024: కొత్త వారం వచ్చింది.. దాంతో ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు కొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఆ వివరాలు..

  • Published Jul 29, 2024 | 10:13 AMUpdated Jul 29, 2024 | 10:13 AM
OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 చిత్రాలు.. ఆ నాలుగింటిపైనే అందరికి ఆసక్తి

కొత్త వారం వచ్చేసింది.. దాంతో ఈ వీక్‌ ఓటీటీల్లోకి వచ్చే సినిమాల జాబితా రెడీ అయ్యింది. ఇప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం కన్నా.. ఇంట్లో కూర్చుని.. హాయిగా నచ్చిన మూవీలను ఎంజాయ్‌ చేయాలని భావించే వారి సంఖ్య పెరిగిపోతుంది. దాంతో ఓటీటీలకు క్రేజ్‌ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయా ప్లాట్‌ఫామ్‌లు.. కోట్లు ఖర్చు చేసి.. ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్‌, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. పైగా ఈ మధ్య కాలంలో థియేటర్‌లలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం.. ఓటీటీలకు క్రేజ్‌ పెరగడం ఎక్కువయ్యింది. చాలా వరకు వీకెండ్‌లో సరికొత్త కంటెంట్‌ ఓటీటీల్లోకి ఎంటర్‌ అవుతోంది. అలానే ఈ వారం వేర్వేరు ఓటీటీల్లోకి సుమారు 20 సినిమాలు రానున్నాయి. వీటిల్లో ఓ నాలుగు చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

ఓటీటీల సంగతి పక్కకు పెడితే.. ఇక ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు నాలుగు ఉన్నాయి. అవి శివం భజే, తిరగబడరా సామీ, ఉషా పరిణయం, బడ్డీ వంటి సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. వీటిల్లో బడ్డీ, శివం భజే మీద కాస్త ఆసక్తి కనిపిస్తోంది. ఇ​క ఓటీటీ రిలీజ్‌ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి జీవితంపై తీసిన డ్యాక్యుమెంటరీ మోడ్రన్‌ మాస్టర్స్‌, అలానే త్రిష నటించి బృందా సిరీస్‌తోపాటు.. కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్ప్‌, డ్యూన్‌ స్టార్‌ 2 లాంటి తెలుగు డబ్బింగ్‌ చిత్రాలపై కాస్త ఆసక్తి ఉంది. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్‌ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్‌ కానుందనేది ఇక్కడ చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలివే..

నెట్‌ఫ్లిక్స్‌..

  • ఏ గుడ్‌ గర్ల్‌ గైడ్‌ టూ మర్డర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్ట్‌ 01
  • బోర్డర్‌లెస్‌ ఫాగ్‌ (ఇండోనేషియన్‌ మూవీ) – ఆగస్టు 01
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ మెక్కికో (స్పానిష్‌ సిరీస్‌) – ఆగస్టు 01
  • అన్‌స్టేబుల్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – ఆగస్టు 01
  • మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి (తెలుగు డాక్యుమమెంటరీ) – ఆగస్టు 02
  • సేవింగ్‌ బికినీ బాటమ్‌ (ఇంగ్లీష్‌ మూవీ) – ఆగస్టు 02
  • జో రోగన్‌ (ఇంగ్లీఫ్‌ కామెడీ ఈవెంట్‌) – ఆగస్టు 03

అమెజాన్‌ ప్రైమ్‌

  • ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ : ద రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) జూలై 29
  • బ్యాట్‌మ్యాన్‌: క్యాప్డ్‌ క్రూసేడర్‌ (ఇంగ్లీఫ్‌ సిరీస్‌) – ఆగస్టు 01

హాట్‌ స్టార్‌

  • ఫ్యుచరమా సీజన్‌ 12 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – జూలై 29
  • నో వే ఔట్‌ (కొరియన్‌ సిరీస్‌) – జూలై 31
  • కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌ (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 02

బుక్‌ మై షో

  • ద బైక్‌ రైడర్స్‌ (ఇంగ్లీష్‌ సినిమా) – ఆగస్టు 02

జియో సినిమా

  • డ్యూన్‌ పార్ట్‌ 2 (తెలుగు డబ్బింగ్‌ సినిమా) – ఆగస్టు 01
  • గహ్డ్‌ చడీ (హిందీ మూవీ) – ఆగస్టు 01
  • టరోట్‌ (ఇంగ్లీష్‌ సినిమా) – ఆగస్టు 03
  • దస్‌ జూన్‌ కీ రాత్‌ (హిందీ సిరీస్‌) – ఆగస్టు 04

సోనీ లివ్‌

  • బృందా (తెలుగు డబ్బింగ్‌ సిరీస్‌) – ఆగస్టు 02

ఆపిల్‌ ప్లస్‌ టీవీ

  • ఉమెన్‌ ఇన్‌ బ్లూ (ఇంగ్లీష్‌ సిరీస్‌) – జూలై 31

marsbahis girişjojobet