nagidream
తమన్నాలో ఈ యాంగిల్ ని మీరు చూసి ఉండరు. మీరు చాలా సినిమాలు చూసి ఉండచ్చు. చాలా సిరీస్ లు చూసి ఉండవచ్చు. అయితే ఏ సినిమాలోనూ, ఏ సిరీస్ లోనూ చేయలేనంతగా ఈ సిరీస్ లో చేసింది. ఆ సీన్స్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది.
తమన్నాలో ఈ యాంగిల్ ని మీరు చూసి ఉండరు. మీరు చాలా సినిమాలు చూసి ఉండచ్చు. చాలా సిరీస్ లు చూసి ఉండవచ్చు. అయితే ఏ సినిమాలోనూ, ఏ సిరీస్ లోనూ చేయలేనంతగా ఈ సిరీస్ లో చేసింది. ఆ సీన్స్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది.
nagidream
పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నారు. షోస్ రూపంలో కావచ్చు, వెబ్ సిరీస్ ల రూపంలో కావచ్చు.. సినిమా రేంజ్ లో కంటెంట్ తో మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తమన్నా, కాజల్, రెజీనా వంటి హీరోయిన్స్ థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ తో అలరిస్తున్నారు. అనుక్షణం ఉత్కంఠ కలిగేలా ఉంటున్నాయి. అలాంటి సిరీస్ లో తమన్నా లీడ్ రోల్ లో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన సిరీస్ ఒకటి ఉంది. ఈ వెబ్ సిరీస్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ ఇందులో తమన్నా ఓ రేంజ్ లో నటించింది.
ఇక ప్రవీణ్ సత్తారు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన కథల్లో ఒక కొత్తదనం ఉంటుంది. చందమామ కథలు, పీఎస్వీ గరుడ వేగ సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ది ఘోస్ట్, గాండీవదారి అర్జున సినిమాలు కథలు చాలా బాగుంటాయి. కానీ ఎందుకు థియేటర్ లో ఎందుకో నిరాశపరిచాయి. మరోవైపు తమన్నా.. ఎప్పుడూ గ్లామరస్ పాత్రల్లో కనిపించే మిల్కీ బ్యూటీ.. ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. తెలుగులో తొలి స్ట్రీమింగ్ యాప్ ఆహా ద్వారా లెవెన్త్ హవర్ సిరీస్ తో తెలుగు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మిల్కీ బ్యూటీ.
ఒక రాత్రిలో జరిగే కథ ఇది. అరత్రికా రెడ్డి (తమన్నా) ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఛైర్మన్. ఈ కంపెనీ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో క్లీన్ పవర్ సోర్స్ ని కనిపెడుతుంది అరత్రికా. దేశానికి క్లీన్ పవర్ ని అందించాలనేది అరత్రికా కల. అయితే దేశానికి మంచి జరుగుతుందంటే పెద్ద వాళ్ళు అడ్డుపడతారు కదా. అలానే అరత్రికా ప్రాజెక్ట్ విషయంలో కూడా అడ్డుపడతారు. రాజకీయ కుట్ర కారణంగా అరత్రికా కంపెనీ దివాళా అంచుకు వెళ్తుంది. దీంతో అరత్రికా మరుసటి రోజు ఉదయం 8 గంటల లోపు ఇంపీరియల్ బ్యాంకుకి 9 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు అరత్రికా మాజీ భర్త, ఆమె కంపెనీ కాంపిటీటర్, ఇంపీరియల్ బ్యాంక్ ప్రెసిడెంట్, దుబాయ్ షేక్.. వీరంతా తమన్నా దగ్గర ప్రపోజల్ ఉంచుతారు. ఆ ప్రాజెక్ట్ ని తమకు అమ్మేయాలి అని అంటారు. తను కల కన్న ప్రాజెక్ట్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు తెల్లారేలోపు ఏదైనా అద్భుతం జరిగితే బాగుణ్ణు అని ఆలోచిస్తుంటుంది. మరి ఆ అద్భుతం జరిగిందా? ఒక్క నైట్ లో 9 వేల కోట్లకు పైగా అమౌంట్ బ్యాంకుకి కట్టిందా? దీని కోసం ఆమె ఎలాంటి ఎత్తుగడలు వేసింది. ఈ క్రమంలో ఆమె కాంప్రమైజ్ అయ్యిందా? తప్పులకు పాల్పడుతుందా? అనేది తెలియాలంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న లెవెన్త్ హవర్ సిరీస్ చూడాల్సిందే.
మొదటి ఎపిసోడ్ నుంచి కూడా కథ చాలా గ్రిప్పింగ్ గా, థ్రిల్లింగ్ గా నడుస్తుంది. తమన్నా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా, దేశానికి మేలు చేసే ప్రాజెక్ట్ ని అందించాలన్న మంచి అమ్మాయిగా.. రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టే ఛాలెంజింగ్ రోల్ లో చాలా బాగా నటించింది. తమన్నా ఇన్నేళ్ళలో చేసిన పవర్ ఫుల్ పాత్ర ఏదైనా ఉందంటే అది ఇదే. నిజ జీవితంలో వ్యాపారవేత్తలు ఎలా అయితే ప్రెజర్ ని ఎదుర్కుంటారో.. ఒక ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకుంటారో తమన్నా తన నటనతో కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఇన్నాళ్లు గ్లామరస్ పాత్రల్లో, బబ్లీ రోల్స్ లో కనిపించిన తమన్నా వేరు.. ఈ సిరీస్ లో కనిపించిన తమన్నా వేరు. సిరీస్ చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.