iDreamPost
android-app
ios-app

OTT Releases: ఈ వారం ఓటీటీలోకీ 18 సినిమాలు!

  • Published Dec 01, 2023 | 4:26 PM Updated Updated Dec 02, 2023 | 8:04 AM

ఈ వారం పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో దాదాపు 18 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన హిట్టు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి...

ఈ వారం పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో దాదాపు 18 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన హిట్టు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి...

  • Published Dec 01, 2023 | 4:26 PMUpdated Dec 02, 2023 | 8:04 AM
OTT Releases: ఈ వారం ఓటీటీలోకీ 18 సినిమాలు!

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. రోడ్డున పడ్డారు. అయితే, కొన్ని రంగాలు మాత్రం ఎంతో ముందుకంటే ఎంతో అభివృద్ధి చెందాయి. అలా కరోనా కారణంగా లాభ పడిన రంగాల్లో ఓటీటీ రంగం ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా జనం మొత్తం ఇంటికి పరిమితం అయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇంట్లో టీవీలకు, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోయారు.

అలా ఓటీటీ వాడకం పెరిగింది. ప్రపంచ నలుమూలలా ఉన్న కంటెంట్‌ను చూసే అవకాశం ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు ఓటీటీకి అడిక్ట్‌ అయిపోయారు. ప్రతీ వారం లేదా రోజు కొత్త సినిమాలు వస్తున్నాయి. అది కూడా థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇంట్లో కూర్చుని అన్ని భాషల సినిమాలు చూసే​ అవకాశం ఉండటంతో.. ఓటీటీ ప్రేక్షకులు అంతకంటే సుఖం ఇంకోటి లేదు అనుకున్నారు. కరోనా పరిస్థితులు లేకపోయినా.. ఇప్పటికీ  అదే తీరు కొనసాగుతోంది.

ప్రేక్షకులను మరింత దగ్గర చేసుకోవటానికి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ కంటెంట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నేరుగా సినిమాలను తీయటమో.. నిర్మాతలనుంచి కొనుక్కోవటమో చేస్తున్నాయి. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను కోట్లు పెట్టి కొంటున్నాయి. ఇక, ఈ వారం పలు ప్రముఖ ఓటీటీల్లో ఏకంగా 18 సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు కూడా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు !

హాట్‌స్టార్‌:

  • చిత్తా (తమిళం)
  • ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ ( ఇంగ్లీష్‌)

నెట్‌ఫ్లిక్స్‌ :

  • మిషన్‌ రాణీగంజ్‌ ( హిందీ)
  • ది ఈక్వలైజర్‌ 3 ( ఇంగ్లీష్‌)
  • మే డిసెంబర్‌ ( ఇంగ్లీష్‌)
  • వర్జిన్‌ రివర్‌ ( ఇంగ్లీష్‌) సిరీస్‌
  • ఫ్యామిలీ స్విచ్‌ ( ఇంగ్లీష్‌)
  • బ్లడ్‌ కాస్ట్‌ ( ఫ్రెంచ్‌ ) సిరీస్‌
  • లవ్‌ లైకే కే డ్రామా (జపనీస్‌) సిరీస్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

  • దూత ( తెలుగు) సిరీస్‌
  • షెహర్‌ లకోట్‌ ( హిందీ) సిరీస్‌
  • 3 ఇడియట్‌ హీరోస్‌ ( హిందీ) సిరీస్‌
  • క్యాండీ కేన్‌ లేన్‌ ( ఇంగ్లీష్‌)

ఆహా :

  • రూల్స్‌ రంజన్‌ (తెలుగు)

యాపిల్‌ టీవీ :

  • ధూమమ్‌(మలయాళం)

జియో సినిమా :

  • కాలేజ్‌ రోడ్‌ ( తెలుగు)

చౌపాల్‌ :

  • ఫుల్‌ మూన్‌ ( పంజాబీ)

బీఎమ్‌ఎస్‌ స్ట్రీమ్‌ :

  • డంబ్‌ మనీ ( ఇంగ్లీష్‌ )

కాగా, చిత్త( తెలుగులో చిన్నా) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీలు మారుతూ వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఈరోజు స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ వారం సందడి చేయనున్న సినిమాల్లో మీ ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinolevant girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom