iDreamPost
android-app
ios-app

“ది కేరళ స్టోరీ” OTT రివ్యూ

  • Published Feb 17, 2024 | 3:53 PMUpdated Feb 17, 2024 | 3:53 PM

ఎట్టకేలకు ఎన్నో వివాదాల మధ్యన కొన్ని నెలల క్రితం థియేటర్ లో విడుదల అయిన "ది కేరళ స్టోరీ" చిత్రం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

ఎట్టకేలకు ఎన్నో వివాదాల మధ్యన కొన్ని నెలల క్రితం థియేటర్ లో విడుదల అయిన "ది కేరళ స్టోరీ" చిత్రం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

  • Published Feb 17, 2024 | 3:53 PMUpdated Feb 17, 2024 | 3:53 PM
“ది కేరళ స్టోరీ” OTT రివ్యూ

ది కేరళ స్టోరీ

నటినటులు: ఆదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని
దర్శకత్వం: సుదీప్తో సేన్
నిర్మాత: విపుల్ అమృతా లాల్ షా
సంగీతం: విరేష్ శ్రీ వలస
సినిమాటోగ్రఫీ: ప్రశాంతను మహాపాత్ర
స్ట్రీమింగ్: జీ5

కొన్ని నెలల క్రితం ఎన్నో వివాదాలతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన చిత్రం “ది కేరళ స్టోరీ”. ఈ చిత్రం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందించి.. సుమారు రూ. 300 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఎన్నో వివాదాల మధ్యన థియేటర్ లో విడుదల అయిన ఈ చిత్రం.. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపు దాల్చిన కారణంగా.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ ను కూడా తన సొంతం చేసుకుంది. ఇక థియేటర్ లో విడుదల అయిన ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది “ది కేరళ స్టోరీ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5లో ప్రసారం అవుతోంది. మరి థియేటర్ లో మిస్ అయిన వారికీ ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది? అసలు ఈ సినిమా అన్ని వివాదాలకు ఎందుకు దారితీసింది? కేరళలో జరుగుతున్న ఎన్నో అఘాయిత్యాలలో.. ఈ సినిమాలో చూపించిన నిజ జీవిత సంఘటనలు ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే “ది కేరళ స్టోరీ” సినిమా రివ్యూ చేయాల్సిందే మరి.

కథ:

షాలిని ఉన్ని కృష్ణన్(ఆదా శర్మ), నీమ(యోగితా బిహాని), గీతాంజలి(సిద్ధి ఇద్నాని) అనే ముగ్గురు యువతులు.. కేరళలో కాసర్గడ్ కు చెందిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు. ఎన్నో ఆశలతో ఇంటి నుంచి దూరంగా కాలేజీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటారు. వీరు ఉండే హాస్టల్ రూమ్ లోనే ఆసిఫా(సోనియా బలాని) మరో యువతి కూడా ఉంటుంది. అయితే ఆమె ఆ ముగ్గురు యువతులకు మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేయాలి అనుకుంటుంది. దానికోసం మరో ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి.. ఆ యువతులతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఆ ప్రయాణంలో షాలిని ఉన్ని కృష్ణన్ గర్బవతి అవుతుంది. కొన్ని రోజులకు ఆ వ్యక్తి షాలినిని మోసం చేసి వదిలేయడంతో.. ఇసాన్ అనే మరో వ్యక్తితో కలిసి సిరియాకు వెళ్తుంది. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత షాలినికి అసలు నిజాలు తెలుస్తాయి. మరి అక్కడి నుంచి షాలిని ఎలా బయట పడిందా లేదా! ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏంటి ! అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయటకు ఎలా తెలియజేసింది! ఆసిఫా మాటలు విన్న మరో ఇద్దరు యువతుల పరిస్థితి ఏంటి! అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా పూర్తిగా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘ద కేరళ స్టోరీ’ లవ్ జిహాద్ పేరున 32 వేలకు పైగా అమాయికులైన హిందూ, క్రిష్టియన్ యువతులను.. ముస్లిం మతంలోకి మారుస్తారు. ఆ తరువాత వారిని ISIS క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తారు. అనే విషయాన్నీ ఈ సినిమాలో చూపించారు. కుల,మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పుకాకపోయినా.. ప్రేమించిన వేరే మతం అమ్మాయిలను ISIS క్యాంపులలో సెక్స్ బానిసలుగా మారుస్తారు. వారు అప్పటి వరకు ఆరాధించే మతాన్ని ద్వేషించేలా చేయడాన్ని.. అక్కడి ప్రజలు తప్పు పడతారు. అలా 2016 నుంచి 2018 మధ్య ఎన్నో వాస్తవ సంఘటనలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ విషయాలలో నాడు సమాజంలో తీవ్ర చర్చలకు దారి తీసిన ఘటనలను ఆధారంగా తీసుకుని..ఈ సినిమాను చిత్రీకరించి.. దర్శకుడు ఓ విధంగా గొప్ప సాహసమే చేసి.. విజయం సాధించాడు అని చెప్పి తీరాలి.

ఇక కథను ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ బోర్డర్ లో పట్టుబడిన షాలినిని విచారిస్తున్న సన్నివేశంతో స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆమెకు ఎదురైన సంఘటనలను, ఆమె అక్కడి వరకు ఎలా వచ్చింది అనే గతాన్ని చెబుతూ.. కథలోకి తీసుకుని వెళ్తాడు. ఓ వైపు షాలిని తన గతాన్ని చెబుతున్నపుడే .. వర్తమానాన్ని కూడా చూపించడంతో.. సినిమా కాస్త హడావిడిగా అనిపిస్తుంటుంది. స్నేహం, ప్రేమ మాటున దాగిన తీయని మాటలు వెనుక ఉన్న తీరని మోసాలను.. ప్రతి సన్నివేశంలోనూ చూపిస్తూ .. కథను రసవత్తరంగా తీసుకుని వెళ్లిన తీరు అద్భుతంగా ఉంటుంది. కానీ, కథను చెప్పేటప్పుడు తప్పంతా ఒకవైపే ఉంది అన్నట్లుగా చూపించారు. నాణానికి రెండు వైపు ఉన్న తప్పులను కూడా చూపిస్తూ.. దాని నుంచి యువత ఎటువంటి ట్రాప్ లో పడకుండా ఉండాలి అనేది కూడా చూపించి ఉంటే.. బహుశా ఈ సినిమాకు పూర్తి న్యాయం జరిగి ఉండేదేమో.

నటినటుల పని తీరు, టెక్నీకల్ విభాగం:

ఈ సినిమాలో నటించిన వారిలో ఆదా శర్మ ఒక్కరే తెలుగు వారికి పరిచయం. కానీ, ఆమెతో పాటు నటించిన యోగితా బిహాని, సిద్ధి ఇద్నాని కూడా ఎంతో అద్భుతంగా తమ నటనను కనబరిచారు. ముఖ్యంగా తీవ్ర మనస్థాపానికి గురైన కొన్ని ఎమోషనల్ సీన్స్ లో వీరంతా తమ నటనకు వంద శాతం న్యాయం చేకూర్చారు. ఇక మిగిలిన నటి నటులు కూడా వారి వారి పాత్రలకు తగిన న్యాయాన్ని చేకూర్చరు. కాగా, టెక్నీకల్ టీమ్ పని తీరు కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో సన్నివేశాలకు తగినట్టు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని బాగా కుదిరాయి. యదార్ధ ఘటనల ఆధారంగా తీసుకున్న ఈ కథను.. ఎమోషనల్ గా చిత్రీకరించారు.

ప్లస్:

1) ఆసక్తికరమైన కథ
2) నటి నటులు నటన
3) టీమ్ వర్క్

మైనస్:

1) ఒకే ద్రుష్టి కోణం పైన ఎక్కువ ఫోకస్ చేయడం.

చివరి మాట: కేరళ పూర్వ వాసనల వాస్తవాలకు అద్దం “ది కేరళ స్టోరీ”.

గమనిక: ఇది సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి