OTT లోకి వివాదాస్పదమైన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చాలా వరకు చిత్రాలు థియేటర్ లో విడుదలైన కొద్దీ రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఓటీటీలో విడుదల కాలేదు.

ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చాలా వరకు చిత్రాలు థియేటర్ లో విడుదలైన కొద్దీ రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఓటీటీలో విడుదల కాలేదు.

కొన్ని నెలల క్రితం తక్కువ బడ్జెట్ రూపొందించిన ఓ చిత్రం.. థియేటర్ లో విడుదల అయ్యి మంచి కలెక్షన్లు సంపాదించింది. అంతే కాకుండా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపు దాల్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ ను కూడా తన సొంతం చేసుకుంది. ఆ చిత్రం మరేదో కాదు ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. ఈ చిత్రం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందించి.. సుమారు రూ. 300 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకుంది. దీని తర్వాత విడుదల అయిన చాలా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చిత్రం థియేటర్ లో విడుదల అయ్యి కొన్ని నెలలు గడిచిపోయింది. కానీ, ఇంతవరకు ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోను దీని ఊసూ రాలేదు. ఇప్పుడు తాజాగా కొత్త సంవత్సరంలో ‘ది కేరళ స్టోరీ’ చిత్రం స్ట్రీమింగ్ కానుందనే కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం కథ విషయానికొస్తే.. ‘ద కేరళ స్టోరీ’ లవ్ జిహాద్ పేరున 32 వేలకు పైగా అమాయికులైన హిందూ, క్రిష్టియన్ యువతులను.. ముస్లిం మతంలోకి మారుస్తారు. ఆ తరువాత వారిని ISIS క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తారు. అనే విషయాన్నీ ఈ సినిమాలో చూపించారు. కుల,మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పుకాకపోయినా.. ప్రేమించిన వేరే మతం అమ్మాయిలను ISIS క్యాంపులలో సెక్స్ బానిసలుగా మారుస్తారు. వారు అప్పటి వరకు ఆరాధించే మతాన్ని ద్వేషించేలా చేయడాన్ని.. అక్కడి ప్రజలు తప్పు పడతారు. అలా 2016 నుంచి 2018 మధ్య ఎన్నో నిజ జీవిత సంఘటనలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

అయితే, ఈ సినిమా విడుదల సమయంలో రాజకీయంగా కొన్ని వివాదాలలో  చిక్కుకుంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, భారీ నిరసనల మధ్య 2023 మే 5న థియేటర్‌లో విడుదల అయింది. విడుదలైన తరువాత కూడా ది కేరళ స్టోరీ సినిమాకు వివాదాలు తప్పలేదు. ఈ సినిమా స్టోరీ కొన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు, సెంటిమెంట్‌లను దెబ్బతీసే విధంగా ఉందంటూ.. ప్రదర్శనలు నిలిపివేయాలని కొంతమంది నిరసనలు చేశారు. కానీ, కొన్ని రోజులకు అన్ని సర్దుకున్నాయి. ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది.

కాగా, థియేటర్ లో ఈ చిత్రాన్ని మిస్ అయినా చాలా మంది దీని ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ‘ద కేరళ స్టోరీ ఓటీటీ రైట్స్ ను.. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుందనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ విషయమై మూవీ మేకర్స్ నుంచి మాత్రం.. ఇప్పటివరకు ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. కానీ, సంక్రాంతి కానుకగా ‘ద కేరళ స్టోరీ’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి, థియేటర్ లో సంచలనం సృష్టించిన ఈ రియల్ లైఫ్ కేరళ స్టోరీ.. ఓటీటీలో ఎంతమందిని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments