iDreamPost
android-app
ios-app

ది కేరళ స్టోరీ డైరెక్టర్ నుంచి మరో సంచలన సినిమా! ట్రైలర్‌ అరాచకం!

  • Published Mar 05, 2024 | 5:58 PM Updated Updated Mar 05, 2024 | 5:58 PM

Bastar, The Naxal Story: ది కేరళ స్టోరీ సినిమా తీసి.. ఇటు సినిమా రంగాన్ని, అటు రాజకీయాలను షేక్‌ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్‌ తాజాగా మరో సంచలనంతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ సెన్సేషన్‌ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Bastar, The Naxal Story: ది కేరళ స్టోరీ సినిమా తీసి.. ఇటు సినిమా రంగాన్ని, అటు రాజకీయాలను షేక్‌ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్‌ తాజాగా మరో సంచలనంతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ సెన్సేషన్‌ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 05, 2024 | 5:58 PMUpdated Mar 05, 2024 | 5:58 PM
ది కేరళ స్టోరీ డైరెక్టర్ నుంచి మరో సంచలన సినిమా! ట్రైలర్‌ అరాచకం!

ది కేరళ స్టోరీ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా. ఎన్నో వివాదాల నడుమ 2023 మే 5న థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. సూపర్‌ సక్సెస్‌ అయింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాల ఉన్నా, యాస్‌ ఏ మూవీ ది కేరళ స్టోరీ సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒకరకంగా చెప్పాలంటే.. ది కేరళ స్టోరీ మూవీ ఓ రాష్ట్ర ఎన్నికలలో ప్రచారాస్త్రంగా మారిందంటే.. ఆ సినిమా ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాను తీసిన దర్శకుడు మెగా ఫోన్‌ నుంచి మరో సంచలన సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే బస్తర్‌, ది నక్సల్‌ స్టోరీ.

కేరళ స్టోరీని మించి మరో సంచలనం క్రియేట్‌ చేసేందుకు డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ రెడీ అయ్యారు. తాజాగా తన నెక్ట్స్‌ మూవీ బస్తర్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదలైంది. ఈ మూవీలో అదా శర్మ ప్రధాన పాత్రలో ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, యశ్పాల్ శర్మ, రైమా సేన్, శిల్పా శుక్లా తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ యూవీ ట్రైలర్‌ చూస్తుంటే.. ఇండియాలో మరో మూవీ అగ్గిరాజేలా ఉంది. ది కేరళ స్టోరీతో ఓ కోణాన్ని ఆవిష్కరించి, కళ్లకు కట్టినట్లు చూపించిన సుదీప్తో సేన్‌.. తాజాగా నక్సలిజంపై పడ్డాడు. బస్తర్‌ మూవీ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా ట్రైలర్‌ రిలీజ్‌ చేసినా.. ఊహించని రెస్పాన్స్‌ వస్తోంది.

ది కేరళ స్టోరీ ఎలాగైతే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిందో ఈ బస్తర్‌ కూడా అలాంటి ఇంప్యాక్ట్‌ క్రియేట్‌ చేస్తుందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుందంటూ మూవీ లవర్స్‌, ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వివాదం నడుమ విడుదలైన కేరళ స్టోరీ భారీ వసూళ్లను రాబట్టి.. టాప్‌ 10 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అలాగే ఇటీవల ఓటీటీలో విడుదలైన కేరళ స్టోరీ.. థియేటర్లను మించిన రెస్సాన్స్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో ఈ సినిమాను జనం ఎగబడి చూశారు. త్వరలో రాబోతున్న బస్తర్‌ కూడా కేరళ స్టోరీని మించి సక్సెస్‌ అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. మరి కిందున్న ట్రైలర్‌ చూసి.. బస్తర్‌పై మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss