iDreamPost
android-app
ios-app

OTTలో ఎక్కువ రన్ టైమ్ తో ది గోట్ లైఫ్?

  • Published Mar 31, 2024 | 12:06 PMUpdated Mar 31, 2024 | 12:07 PM

11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఆడుజీవితం’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బ్లెస్సీ ఇటీవల ఓ ప్రముఖ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాణం గురించి విస్తృతంగా మాట్లాడారు. ఆసక్తికరంగా, సీనియర్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం వాస్తవానికి చాలా ఎక్కువ రన్ టైమ్ తో తెరకెక్కిందట.

11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఆడుజీవితం’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బ్లెస్సీ ఇటీవల ఓ ప్రముఖ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాణం గురించి విస్తృతంగా మాట్లాడారు. ఆసక్తికరంగా, సీనియర్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం వాస్తవానికి చాలా ఎక్కువ రన్ టైమ్ తో తెరకెక్కిందట.

  • Published Mar 31, 2024 | 12:06 PMUpdated Mar 31, 2024 | 12:07 PM
OTTలో ఎక్కువ రన్ టైమ్ తో ది గోట్ లైఫ్?

ఒక పక్క ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరో వైపు ఆ సినిమాలో ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన పుకార్లు వస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణను అందుకుంటుంది. సీనియర్ దర్శకుడు బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి చేసిన తరువాత డిస్నీ హాట్‌స్టార్‌ ప్లాట్ ఫారమ్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలి ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఆడుజీవితం ఓటీటీ వెర్షన్ ఎక్కువ రన్‌టైమ్‌తో విడుదల కావచ్చని తెలుస్తోంది.

11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఆడుజీవితం’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బ్లెస్సీ ఇటీవల ఓ ప్రముఖ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాణం గురించి విస్తృతంగా మాట్లాడారు. ఆసక్తికరంగా, సీనియర్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం వాస్తవానికి చాలా ఎక్కువ రన్ టైమ్ తో తెరకెక్కిందట. సుమారు 3 గంటల 30 నిమిషాల రన్‌టైమ్‌ని కలిగి ఉన్న ది గోట్ లైఫ్ సినిమాను బ్లెస్సీ అండ్ టీమ్ 30 నిమిషాలకు పైగా ఫుటేజీని కత్తిరించారట. ఎందుకంటే అంత ఎక్కున లెంగ్త్ ఉంటే ధియేటర్లలో సినిమాని ప్రదర్శించడానికి ఇబ్బంది అవుతుంది కదా.

The Goat Life with longer run time in OTT

అయితే ది గోట్ లైఫ్ అన్ కట్ వెర్షన్ త్వరలో విడుదల కానుందని దర్శకుడు బ్లెస్సీ ధృవీకరించారు. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా ఓటీటీ వెర్షన్ ఎక్కువ రన్‌టైమ్‌ తో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసిన వెంటనే, డిస్నీ హాట్‌స్టార్‌లో అన్‌కట్ వెర్షన్‌ను ప్రసారం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ది గోట్ లైఫ్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి లాంగ్ రన్ వస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. అందువల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంత లేదన్న ఆరు వారాలన్నా ఆగాల్సిందే. అప్పటికి గానీ థియేట్రికల్ వెర్షన్ కి ఓటీటీ వెర్షన్ కి రన్ టైమ్ పరంగా ఎంత తేడా అనేది తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి