Tirupathi Rao
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రిలీజైన 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రిలీజైన 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
Tirupathi Rao
దళపతి విజయ్– త్రిష జంటగా నటించిన లియో సినిమాకు వరల్డ్ వైడ్ గా ఎంతో మంచి క్రేజ్ లభించింది. కలెక్షన్స్ విషయంలో కూడా లియో తన సత్తా చాటింది. లోకేశ్ కనగరాజు మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో ప్రేక్షకులను అలరించిన చిత్రం ఇది. అంతేకాకుండా లోకీ యూనివర్స్ లోకి విజయ్ వస్తాడా? రాడా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం కూడా చెప్పాడు. అంటే కమల్, విజయ్, కార్తీ, సూర్య వీళ్లంతా కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్ లో చూసిన, చూడని ఆడియన్స్ కూడా OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలోకి లియో వచ్చేసింది.
లియో సినిమాకి ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 5 వారాలు గడిచాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఈ సినిమాకి రెండు తేదీలు అనౌన్స్ చేశారు. నవబంర్ 24, నవంబర్ 28 అని ముందు ప్రకటించారు. అయితే ఏ రోజు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది అనే దానిపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు. ఫ్యాన్స్ అంతా ఆ వివరాలు కోసం తెగ ఎదురుచూశారు. అయితే చివరికి నవంబర్ 24నే స్ట్రీమింగ్ అని క్లారిటీ ఇచ్చారు. ఇంకేముంది దళపతి విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా.. నవంబర్ 23నే టీవీలకు అతుక్కుపోయారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది అనుకున్నారు.
కానీ, అలాకాకుండా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంక ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలి అనే ప్రశ్న చాలామందికి ఉండే ఉంటుంది. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ నెట్ ఫ్లిక్స్ సంస్థం. శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి నెట్ ఫ్లిక్స్ లోనే లియో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాలో ఇంకో క్రేజీ అప్ డేట్ కూడా ఉంది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనే కాకుండా.. ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇంగ్లీష్ వర్షన్ ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంక లియో చిత్రం విషయానికి వస్తే.. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజైంది. మొదటి ఆట తర్వాత ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రివ్యూల విషయంలో మాత్రం లియోకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
అంత పాజిటివ్ రివ్యూలు రాలేదు. కానీ, ఈ మూవీపై నెలకొన్న బజ్ తో మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఆ తర్వాత కూడా లోకీ టేకింగ్ కోసం ఈ సినిమాని విపరీతంగా చూశారు. నెగిటివ్ టాక్ తో కూడా రిపీటెడ్ ఆడియన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇంక కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.550 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీలో ఒక్క విజయ్ మాత్రమే కాకుండా సంజయ్ దత్, అర్జున్, త్రిష, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ వంటి యాక్టర్స్ ఉండటంతో కలెక్షన్స్ కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. మరి.. లియో చిత్రం ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.