సైలెంట్ గా OTTని దున్నేస్తున్న.. ఈ హారర్ సస్పెన్స్ మూవీ చూశారా?

OTT Movie Suggessions: ఓటీటీలు ఎక్కువయ్యాక ఏ మూవీ చూడాలో ఎవరికీ క్లారిటీ ఉండటంలేదు. అందుకే మీకోసం ఒక మంచి హారర్ మూవీ సజీషన్ తీసుకొచ్చాం.

OTT Movie Suggessions: ఓటీటీలు ఎక్కువయ్యాక ఏ మూవీ చూడాలో ఎవరికీ క్లారిటీ ఉండటంలేదు. అందుకే మీకోసం ఒక మంచి హారర్ మూవీ సజీషన్ తీసుకొచ్చాం.

గతంలో సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. లేదంటే టీవీల్లో వచ్చే మూవీస్ చూడాలి. కానీ, ఇప్పుడు అలా కాదు కదా.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చేశాయి. ఒక్కొక్కరు రెండు నుంచి మూడుకు పైగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్స్  తీసుకుంటున్నారు. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వారానికి కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్క ఓటీటీలోకే నాలుగైదు సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఇలా లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండటంతో ఏ సినిమా చూడాలో కూడా క్లారిటీ రావట్లేదు. మూవీ వెతుక్కోవడానికే కనీసం అరగంట సమయం పడుతోంది. అలాంటి వారికోసం ఒక మంచి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

ఓటీటీల్లో చాలానే సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి. అయితే హారర్ అనే సరికి ఎక్కువ హాలీవుడ్ సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి అందరికీ ఒక పట్టాన నచ్చవు. ఈ మూవీ మాత్రం అలా కాదు హారర్ సస్పెన్స్ చిత్రాలు ఇష్టపడేవారికి తెగ నచ్చేస్తుంది. ఐఎండీబీ కూడా ఈ మూవీకి ఏకంగా 8 రేటింగ్ ఇచ్చింది. ఆ మూవీ మరేదో కాదు.. ‘తంతిరం ఛాప్టర్ 1: టేల్స్ ఆఫ్ శివకాశీ’. ఈ సినిమాకి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించగా.. శ్రీకాంత్ కండ్రాగుల నిర్మించాడు. ఈ మూవీలో శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. 22 సెప్టెంబర్ 2023న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. 2023 నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

గత మూడు నెలలుగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీని దున్నేస్తోంది. చాలామంది ఈ మూవీ సజీషన్ లోకి వచ్చినా కూడా కచ్చితంగా లైట్ తీసుకుని ఉంటారు. నిజానికి ఇది లైట్ తీసుకోవాల్సిన హారర్ చిత్రం అయితే కాదు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటుంది. అయితే ఈ ఛాప్టర్ 1లో ఎక్కువ కథ ఉండదు.. కానీ, ప్రశ్నలు మాత్రం చాలానే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఛాప్టర్ 2లో దొరుకుతాయి. అది చూడాలంటే మీరు కచ్చితంగా పార్ట్ 1 చూడాల్సిందే. అలాగని ఈ మూవీ సో సోగా ఉంటుంది అనడానికి లేదు. డ్రామాని ఇష్టపడే వారికి ఎంతో బాగా నచ్చుతుంది. ఒక మనిషి జీవితంలో ఉండే దురాశ, కోపం, క్రోధం, లోభం.. ఇలా ప్రతి ఎమోషన్ ని ఎంతో చక్కగా చూపిస్తారు. ప్రతి సీన్ మిమ్మల్ని ఆలోజింపచేసే విధంగా ఉంటుంది.

కథ ఏంటంటే?:

విజయ్ అనే కుర్రాడు తన మిత్రులకు పార్టీ ఇచ్చేందుకు ఒక పాడుబడిన గోదాముకు తీసుకెళ్తాడు. ఒకప్పుడు అది టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీ. విజయ్ మిత్రులకు ఒక ఆసక్తికర కథ చెప్తాను అంటాడు. ఒక వ్యక్తి మరో లోకంలో ఉండే జీనీ పెట్టిన ఆశకు ఎలా బలయ్యాడు అనే విషయాన్ని కథగా చెప్తాడు. ఆ కథే ఈ ఛాప్టర్ 1 స్టోరీ. ఆ యజమాని పేరు బాలచంద్రన్(శ్రీకాంత్ గుర్రం).. అతని భార్య పేరు అలగిని(ప్రియాంక శర్మ). ఒకసారి అనుకోకుండా బాలచంద్రన్ జీవితంలోకి జీనీ ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. అసలు జీనీ కథలు నిజమేనా? ఆ జీనీ ఎందుకు బాలచంద్రన్ లైఫ్ లోకి వచ్చాడు? అతని జీవితాన్ని నాశనం చేశాడా? ఉద్దరించాడా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. అలాగే బాలచంద్రన్ కథ విజయ్ కి ఎలా తెలుసు? అసలు విజయ్ ఎవరు? ఆ ఫ్యాక్టరీకే తన మిత్రులను ఎందుకు తీసుకెళ్లాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఛాప్టర్ 2లో సమాధానాలు చెప్తాన్నారు. మరి.. తంతిరం సినిమా మీరు ఇప్పటికే చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments